పలు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం చలివేంద్రల ఏర్పాటు చేసిన అధికారులు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు సీఈవో గణపతి మిట్టపల్లి గ్రామంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ నర్వ జైపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని గ్రామ ప్రజలకు,ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు చలివేంద్ర కేంద్రాలను గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయమని అన్నారు.ప్రజలకి కాకుండా పశువులకు,పక్షులకు కూడా ప్రజలు తమతమ నివాసాలలలో ధాన్యాన్ని నీళ్లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ గ్రామ నాయకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.