వేలాడుతున్న వైర్లను సరి చేయని అధికారులు

సొంతంగా రిపేర్లు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న అన్నదాతలు

కొత్త మీటర్కు వైర్ కనెక్షన్ కు అదనంగా మూడుపులు ముట్టాల్సిందే

స్తంభం ఎక్కాలన్నా చేతులు తడపాల్సిందే

చేర్యాల నేటిధాత్రి…

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రతి పనికి ఒక రేటు పలుకుతుంది కొత్త మీటర్ కావాలన్నా దానికి సర్వీస్ వైర్ కనెక్షన్ ఇవ్వాలన్న కరెంటుకు సంబంధించిన రిపేర్లు చేయాలన్న సిబ్బంది చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముల్లె ముట్టనిదే ఆఫీసర్ కూడా కుర్చీలోంచి కదలక పోవడం కంప్లైంట్ చేసిన ఫీల్డ్ మీదకు రాకపోవడంతో అధికారులు సిబ్బంది చేయాల్సిన పనిని రైతులు వినియోగదారులే చేసుకోవాల్సి వస్తుంది. దీంతో కరెంటు షాక్ కొట్టి ఎంతోమంది సాధారణ జనాలు రైతులు ప్రాణాలు కోల్పోతుండగా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ల జోలికి వెళ్తూ రైతులు మృత్యువాత పడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పనిచేసి పెట్టాల్సింది పోయి లంచాలకు అలవాటు పడి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మద్దూరు మండలం నర్సయపల్లి గ్రామానికి చెందిన మంతెన మహిపాల్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో కరెంటు వైర్లు వేలాడుతూ గట్టుపై నడుస్తుంటే తలకు తాకే విధంగా ఉన్నాయి పలుమార్లు విద్యుత్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికారులు నిర్లక్ష్యం వల్ల రైతులు ప్రాణాలు వదులుతున్నారు.

కరెంటు స్తంభం ఎక్కితే పైసలే

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలామంది ఏఈలు, లైన్మెన్లు, హెల్పర్లు, నామ్ కే వాస్తుగా డ్యూటీలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో వేలాడుతున్న తీగలతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. వినియోదారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు తాకుతున్న చెట్ల కొమ్మలను క్లియర్ చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో రైతులు చెట్లను వారే సొంతంగా తీసివేస్తున్నారు. చాలా సందర్భాల్లో చేయి తడపనిదే లైన్మెన్లు స్తంభం కూడా ఎక్కడం లేదు.

డబ్బులు పెట్టె పోల్స్ వేసుకోమంటున్నారు

గ్రామాల్లో చాలా చోట్ల కరెంటు వైర్లు వేలాడుతున్నాయి ఏఈలు. లైన్మెన్లు కు చెప్పిన పట్టించుకోవడం లేదు. డబ్బులు పెట్టి పోల్స్ వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పోల్స్ తక్కువగా ఉండటంతో ప్రజలు కరెంటు వైర్లకు కర్రలను సపోర్టుగా పెట్టుకోవడంతో అది గాలికి మరియు కోతులు ఆ కర్రలను ఊపడంతో అవి ఒక్కసారిగా నేలపైన పడడంతో ప్రజలు చూసుకోకుండా వాటికి తగలడంతో ప్రాణాలు వదులుతున్నారు. ఈ చావులకు ఆఫీసర్లే బాధ్యత వహించాలని ఇకనైనా రైతులను సతాయించకుండా ఎవరు డ్యూటీ వారు చేయాలని రైతులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!