ఉచిత గృహజ్యోతి పథకం పట్ల అధికారుల ప్రచారం.
చంద్రయ్యపల్లి,మల్లంపల్లి,గొల్లపల్లి గ్రామ పంచాయతీలో అమలు కార్డుల పంపిణీ.
నర్సంపేట,దుగ్గొండి,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అమలవుతున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు పట్ల శనివారం దుగ్గొండి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అందుకు గాను చంద్రయ్యపల్లి,మల్లంపల్లి,గొల్లపల్లి గ్రామ పంచాయతీలలో విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్య శర్మ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఆరెల్లి లత వీరేశం గౌడ్,బూర రాధిక హేమ చందర్ గౌడ్,కట్కూరి కోమల వీరారెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామస్తులతో కలిసి గృహజ్యోతి అమలు పత్రాల ప్రదర్శించారు.ఆయా గ్రామాల్లో ఏఈ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహజ్యోతి పథకం వలన సాధారణ ప్రజలకు భారం తగ్గిందని తెలిపారు.అందుకు మిగిలుతున్న కరెంట్ బిల్లులు డబ్బులతో మీ మీ పిల్లల చదువులకు,ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమాలలో చంద్రయ్యపల్లి ఉప సర్పంచ్ బొమ్మినేని సుధాకర్ రెడ్డి,సబ్ ఇంజనీర్ వినయ్, లైన్ ఇన్స్పెక్టర్ జోగారావు, హెల్పర్ రాములు గ్రామ పంచాయితీల వార్డ్ మెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.
