వనపర్తి లో ఓటర్ల జాబితా తప్పులు సవరణచేయాలి
పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వార్డులలో ఓటర్ల జాబితా తప్పులు ఉన్నాయని కొన్నివార్డు లలో ఫోటోలు లేవని పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ను ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన నేటిదాత్రి దినపత్రిక విలేకరితో మాట్లాడుతూ వనపర్తి లో బినామీ ఓట్లు వివిధ వార్డులలో ఉన్నాయని వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు బినామీ ఓటర్ల గురించి ప్రజలు తమ దృష్టికి తెచ్చారని ఎన్నికల అధికారులు విచారణ జరిపి తొగించాలని ఆయన కోరారు ఓటర్ ఆధార్ లింక్ చేయాలని ఓటు వేసే ముందు ప్రభుత్వ ఐ డి ప్రూఫ్ ఫోటో ను తనిఖీ చేయాలని కోరారు
