Leopard Panic Near Mallanna Gutta
మల్లన్న గుట్ట వద్ద
పెద్దపులి కలకలం
అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు
నిజాంపేట: నేటి ధాత్రి
కామారెడ్డి సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్దపులి మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలోని మల్లన్న గుట్ట వద్ద సంచరిస్తున్నట్లు ఓ రైతు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన రామాయంపేట అటవీ అధికారి విద్యాసాగర్, ఎస్ఐ రాజేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో జంతువు పాదముద్రలను పరిశీలించారు. నమూనాలను సేకరించి ల్యాబ్ కి పంపించడం జరుగుతుందన్నారు. జంతువు ఏంటి అనేది కచ్చితంగా నిర్ధారణ కాలేదని, పాదముద్రల ఆధారంగా చిన్నపాటి జంతువు అయ్యి ఉండొచ్చని తెలిపారు. ఆ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తుందని తెలిపారు. అటవీ అధికారులు నిరంతరం గ్రామాలపై పర్యవేక్షణ చేపట్టడం జరిగిందన్నారు.
