వనపర్తి నేటిదాత్రి :
ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా పార్లమెంటు ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అధికారుల ను ఆదేశించారు. జిల్లా
ఎస్పీ శ్రీమతి కె రక్షిత మూర్తి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ అంశంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా బెల్టు షాపుల విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. బైండోవర్ కేసుల అంశంలో అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా, జాగ్రత్తగా పని చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, డీఎఫ్వో నవీన్, ఆర్డీవో పద్మావతి , డీఎస్పీ వెంకటేశ్వర్, అందరు నోడల్ అధికారులు, సెక్టర్ అధికారులు,ఫ్లైయింగ్ సర్వేవలెన్స్, విజిలన్స్,వీడియో బృందాల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.