*అధికారులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిం చాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి నిజాయితీతో భేదాభావం లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం ఐ.డి.ఓ.సి ప్రజావాణి హాల్లో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సర్విలియన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారుఅక్టోబర్9 మధ్యాహ్నం నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున వనపర్తి నియోజకవర్గంలో సైతం నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎం సి సి నిబంధనలు, స్క్వాడ్, సర్విలియాన్ టీం ల బాధ్యతలను తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందని సూచించారు.వనపర్తి జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 24/7 పర్యవేక్షణ చేస్తుంటాయని తెలిపారు. జిల్లాలోని నలుమూలల చెక్ పోస్ట్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా , ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం వంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు. సి.విజి యాప్ ద్వారా కానీ 1950 టోల్ ఫ్రీ లేదా కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వస్తె 15 నిమిషాల్లో నే చేరుకునే విధంగా లొకేషన్ లు చూసి ఉండాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా సమస్యాత్మక ప్రదేశాలలో ప్రత్యేకమైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సకాలంలో చేరుకొలేని పక్షంలో కంట్రోల్ రూం కు లేదా 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి లో ఎక్కడైనా సమస్యలు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా ఎన్నికల కమిషన్ యాప్ రూపొందించిందని తెలిపారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాలలో కంప్లైంట్ ని చేదించి సమస్య పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో కేంద్ర ఎన్నికల కమిషను ఫిర్యాదు చేరుకుంటుందని తెలిపారు. పౌరులు ఎవరైనా ఎన్నికలపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 1950 హెల్ప్ లైన్ 24/7 అందుబాటులో ఉంటుందని అన్నారు.

జిల్లాలో స్టాటిస్టిక్ సర్వలెన్స్ టీం ఏస్ఎస్ టి చురుకుగా పని చేయాలని ఎక్కడైనా 50వేల రూపాయల కన్నా అధికంగా రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా సందేహాస్పదంగా ఉంటే దానిని వెంటనే సీజ్ చేయాలని తెలిపారు10 లక్షల రూపాయల వరకు సరైన ఆధారాలు ఉంటే సీజ్ చేయము కానీ ఇన్కమ్ టాక్స్ వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎక్కువ విలువ గల వస్తువులు ఉన్నా వీడియో, సిసి టీవీ కవరేజ్ చేస్తూ సీజ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల స్టార్ క్యాంపెనర్ వద్ద పార్టీ కార్యకలాపాల కోసం రసీదుతో కూడిన ఒక లక్ష రూపాయల వరకు అనుమతించవచ్చని, లక్ష నుండి పది లక్షల వరకు ఉన్నచో ఇట్టి సమాచారాన్ని ఇన్కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, లేదా ప్రలోభాలకు గురిచేయడం లాంటి ఏ కార్యక్రమం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదాహరణకు పెండ్లీలు, పండగల పేరుతో భోజనాలు ఏర్పాటు చేయడం, కానుకలు ఇవ్వడం వంటివి చేయరాదన్నారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి అధికారి సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఎన్నికల విధులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆనంద్ రెడ్డి, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!