బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు
నర్సంపేట,నేటిధాత్రి :
ఆశాలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా హైదరాబాదులో ధర్నా చేయడానికి పోతుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ఆశ వర్కర్లు ఎవరు హైదరాబాద్ ధర్నాకు వెళ్లొద్దని జిల్లా స్థాయి నుండి క్రింది స్థాయి వరకు వైద్యాధికారులు బెదిరింపులకు పాల్పడుతూ వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం ఫోన్ల ద్వారా బెదిరించడం సరికాదని సమస్యల పరిష్కారం కోసం అధికారుల కు ముందస్తు సమాచారం ఇచ్చి వెళుతున్నారని ధర్నాలో పాల్గొన్న వారిని సస్పెండ్ చేస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజా పాలన అని చెప్పిన ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే అరెస్టులకు బెదిరింపులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు.