
శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహణకు పటిష్ట బందోబస్తు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, మే – 10(నేటి ధాత్రి):
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ,నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిర్వహించవలసిన విధివిధానాలు , శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై జిల్లా పరిధిలోని సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది రానున్న రెండు రోజులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని,శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 1500 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలు , బ్యాలెట్ బాక్స్ లకు రక్షణ కల్పించాలని, ప్రతి రూట్ మొబైల్ అధికారి వద్ద ఏదైనా సంఘటనలు జరిగితే స్పందించే అధికారుల యెక్క మొబైల్ నెంబర్ లిస్ట్ దగ్గర ఉంచుకోవాలని,డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాల వరకు పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ సెంటర్ వరకు ఈ.వి.ఎం లు తరలించే వరకు రూట్ మొబైల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు.ఆయా రూట్ లలో ఉన్న మొబైల్ పార్టీలు ఒకే చోట ఉండకుండా తమ రూట్ లలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను అబ్జర్వ్ చేస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండ చూసుకోవాలని సూచించారు.
పోలింగ్ డే కు ముందు రోజు 48 గంటలపాటు తమ తమ ఏరియాలలో గల వైన్ షాప్స్, లేట్ నైట్ దాబాలు క్లోజ్ చేయించాలని, ఇంటింటి ప్రచారాలు, క్యాంపెనింగ్ వెహికల్స్ తిరగకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తమ నియోజకవర్గం లో ఉండడానికి వీలు లేదని, అందుకుగాను తమ ఏరియాలో గల రెస్టారెంట్స్, లాడ్జీలను చెక్ చేయాలని సూచించారు.డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నరు.
జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్ర చారి మురళీకృష్ణ, సర్వర్,సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.