
"Dalit Employees Face Discrimination in Zaheerabad"
ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష???
జహీరాబాద్ నేటి ధాత్రి:
జిల్లా ఇంచార్జి మంత్రి దళితుడే.. ఆరోగ్య శాఖ మరియు జిల్లా మంత్రి మంత్రిదళితడే, నియోజకవర్గం శాసనసభ్యులు దళితుడే కానీ దళితలంటే ఈ అధికారులకు గిట్టదు..
ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష జిల్లా డీ పీ ఓ, మరియు డివిజనల్ పంచాయతీ అధికారి తీరు ఇలా ఉన్నందున తక్షణమే ఈ అధికారుల పైన చర్యలు తీసుకొనేలా చేయాలనీ జహీరాబాద్ నియోజకవర్గం
శాసనసభ్యులకు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ చెంద్రశేఖర్ లకు దళిత సంఘాల విజ్ఞప్తి చేస్తున్నవి.నెలరోజులు గడవక ముందే సస్పెండ్ అయినా తుంకుంట పంచాయతీ కార్యదర్శి కి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం ఎస్. సి కార్యదర్శి లు సస్పెండ్ అయి ఆరు నెలలు గడిచిన నేటికీ పోస్టింగ్ లు ఇవ్వకపోవడం పైన దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల పైన వివక్ష చూపడం జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారికి తగదని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నారు. అన్ని డివిజనల్ కార్యాలయాలు నియోజకవర్గం లో ఉన్నపుడు డీ ఎల్ పీ ఓ కు ఎందుకు కార్యాలయం ఉండదని కోరుతున్నారు.బి సి లకు ఒక న్యాయం ఎస్ సి లకు ఒక న్యాయమా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా డీ పీ ఓ మరియు డీ ఎల్ పీ ఓ తీరు మార్చుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తప్పదని
హెచ్చరించారు.ప్పాంపాడ్, రాయికోడ్, ఖర్చల్, ఇందూర్, హస్నాబాద్,ఉల్గేరా, రాయి పల్లి, కుస్ నూర్, రాఘవాపుర్, చాల్కి,డప్పుర్, రత్నపూర్, చిక్కుర్తి, రత్నపూర్, ఉసెల్లి, మొగుడం పల్లి, పార్వతపూర్, దనసిరి, సత్వర్, సరిహద్దు తండాలు, సజ్జపూర్, బిళ్ల్పూర్, గోటిగార్పల్లి, శేఖపూర్, జిర్లపల్లి, ఏడాకులపల్లి, గుంతమర్పల్లి, ఝరాసంగం,కంబాలపల్లి, సిద్ధపూర్, గణేశపూర్ బీదర్ సరిహద్దు గ్రామాలు ఎన్నో తీరుగాల్సిన డీ ఎల్ పీ ఓ కేవలం హైవే పైన ఉన్న గ్రామాలు మాత్రమే తిరుగుతు కార్ ట్యాంక్ ఫుల్, బ్యాగ్ ఫుల్ చేసుకొంటూ కార్యదర్శి ల జెబులు నిల్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. డ్రైవర్ కి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ మరి ముఖ్యంగా దళిత కార్యదర్శి లపైన టార్గెట్ చేస్తున్నారనీ అందరు కార్యదర్శి లు ఆందోళన చెండుతున్నారు. ఇలాంటి అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి దళిత సంఘాలు కోరుతున్నాయి. నియోజకవర్గం శాసనసభ్యులు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి డాక్టర్ చెంద్రశేఖర్ చోరువ తీసుకొని ఆ అధికారి తీరు మారేటట్టు చూడాలని దళిత సంఘాలు కోరుకొంటున్నారు.