
bjp
ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి
బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు
ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అర్హులైన లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే గృహ నిర్మాణంకు మట్టి తప్పనిసరి అవసరం ఏర్పడుతుంది, కానీ ఆయా గ్రామ పంచాయతీల్లో మట్టి లభ్యత లేకపోవడం, ఉన్న ప్రాంతంలో మట్టి తీసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుండి అనుమతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయితీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఆయా గ్రామ పరిధిలో మట్టి లభ్యత లేదనందున సింగరేణి ఓసీ త్రీ మట్టిని సింగరేణి అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్ పాల్గొన్నారు