OC Singha Garjana on January 11 in Warangal
జనవరి 11న “ఓసీ” సింహ గర్జన.
ఓసి జేఏసీ రాష్ట్ర నాయకుల పిలుపు.
“నేటిధాత్రి”,వరంగల్.
జాతీయ స్థాయిలో ఓసీ లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో కూడా అమలు చేయాలనీ ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి డిమాండ్ చేసారు మొదటి నుండి అన్ని రంగాలలో ఓసీ లకు వివక్షతో జరుగుతున్న అన్యాయాలపై జనవరి 11 న వరంగల్ లో తలపెట్టిన సింహ గర్జన ను విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు….

సింహ గర్జన కోసం ప్రతి ఓసీ బిడ్డా ఒక సైనికుడిలా పని చేయాలనీ పిలుపునిచ్చారు బుధవారం హన్మకొండ బాలసముద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ జేఏసీ కార్యాలయాన్ని సీనియర్ జర్నలిస్ట్ తుమ్మ శ్రీధర్ రెడ్డి ఓసి జేఏసీ రాష్ట్ర నాయకులు దుబ్బ శ్రీనివాస్ రాయపాటి వెంకటేశ్వరావు లు ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశం లో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి…

ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్ లు మాట్లాడుతూ రెడ్డి వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి లతో పాటు రిజర్వేషన్ పొందని ఇతర సామాజిక వర్గాలు అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించదని అన్నారు అయితే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా రెండు సంవత్సరాలు కాలాయాపన చేసిందని… అలాగే కావాలనే రిజర్వేషన్లపై కొందరు దుష్ప్రచారం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు
ఓసిలంతా ఐక్యంగా ఉండి న్యాయమైన హక్కుల కోసం పోరాడవలసిన సమయం వచ్చిందని పోరాటాల గడ్డ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జనవరి 11 న లక్ష మందితో జరిగే భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలనీ పిలుపునీచ్చారు… అనంతరం జేఏసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేసారు ఈ కార్యక్రమలో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులు రాము నడివిల్లి వెంకటేశ్వరావు అర్జుల కిషన్ రెడ్డి చందుపట్ల నర్సింహ రెడ్డి.. దొడ్డ మోహన్ రావు వీరారెడ్డి సంజీవ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ లు కృష్ణ మోహన్ పెద్దిష్ బుచ్చిరెడ్డి జేఏసీ నాయకులు తోట సురేష్…జగన్ మోహన్ శర్మ బ్రాహ్మణ సంఘ నాయకురాలు వాణి తదితరులు పాల్గొన్నారు
