న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మండల ఇన్చార్జి రాజిరెడ్డిని స్కాల్కల్ మండలము న్యాల్ కల్ తహసిల్దార్ నియమిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.ఇది వరకు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భూపాల్ మేడ్చల్ కు బదిలీ అవ్వడంతో మండల ఉప తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండల ఇన్చార్జి తహసిల్దారుగా విధుల్లో చేరారు. విధి నిర్వహణలో రెవెన్యూ చట్టానికి లోబడి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విధులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసిల్దార్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.