అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కౌకొండ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించిన పోషణ మాసపక్షం కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషకాహారంతోనే తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.ప్రతి బిడ్డకి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతతో పాటు, పిల్లలకి స్థానిక ఆహార పదార్థాలు,చిరు ధాన్యాలతో వివిధ వంటకాలను తయారు చేసి అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలని తల్లులకు సూచించారు. అనంతరం పిల్లల ఎదుగుదల ఎత్తు బరువు కొలతలు పరిశీలించారు.తల్లులకు బాలింతలకు పోషణ ఆహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమ్రోన్,స్వరూప, అరుణ,కల్పన,తల్లులు తదితరులు పాల్గొన్నారు.