అంగన్వాడ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన పోషణ పక్వాడా కార్యక్రమానికి జడ్పీ సీఈవో విజయలక్ష్మి , డి డబ్ల్యు ఓ నాగేశ్వరరావు ఎంపీడీవో రామయ్య గారు, ఎమ్మార్వో ఖాజా మొహద్దీన్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ పోషణ పక్వాడా ఉద్దేశం తెలిపినారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఈఓ మాట్లాడుతూ మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత వెయ్యి రోజులు అంటే గర్భిణీ దశ 270 రోజులు ఒక సంవత్సరము బాబు 365 రోజులు రెండు సంవత్సరాల 365 రోజులు మొత్తము వెయ్యి రోజుల గురించి తల్లులకు అవగాహన కల్పించారు. పోషణ పంచ సూత్రాలుహ్యాండ్ వాష్,శానిటేషన్,డయేరియా, రక్తహీనత వెయ్యి రోజులు యోగ యొక్క ప్రాముఖ్యత కౌమారదశ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం వర్షపు నీటి పరిరక్షణ, ఆయుష్ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన జీవితం రక్తహీనత పెరుగుదల, పర్యవేక్షణ పరిసరాల పరిశుభ్రత, స్వదేశీ బొమ్మలను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాల ప్రాముఖ్యత బాల్య రంభవిద్య, ( ఈ సి సి ఈ ) ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కార్నర్ ను ఏర్పాటు చేసి పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధరలు ఎక్కువ పోషక విలువలు ఉండే రాగులు, సజ్జలు, సాధులు, కొర్రలు, జొన్నలు, కరివేపాకు, చిరుధాన్యాల పైన అవగాహన కల్పించారు. రోజు ఆహారంలో వీటిని తీసుకొనే వలెనని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద గారు, మెడికల్ ఆఫీసర్ నవత, పంచాయతీ సెక్రెటరీ దేవేందర్, ఐసిపిఎస్ రాజ్ కుమార్, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, అధిక సంఖ్యలో మహిళలు, కిశోర బాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, ఆరుగురు పిల్లలకి అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!