ఎండపల్లి, నేటి ధాత్రి
జాతీయ పోషణ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం 1,లో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. పోషణ పక్షోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. బాలింతలు, పిల్లలకు పోషణ లోపం నుండి ఎలా విముక్తి పొందాలో పోషణ పక్వాడ్ ద్వారా అవగాహన కల్పించారు. సరైన పోషకాహారం తీసుకుని పిల్లలు, బాలింతలు మెరుగైన శక్తి సామర్ధ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ అంగన్ వాడి కేంద్రం 1, ఉపాధ్యాయురాలు పొడేటి సువర్ణ బాలింతలు, బాలలు తదితరులు పాల్గొన్నారు.