చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్
సూపర్వైజర్ అప్సర సుల్తానా
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ అప్సర సుల్తానా ఆధ్వర్యంలో గాంధీ నగర్ గ్రామం లో పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు పోషక విలువలను పెంపొందించుకోవడం కోసం అంగన్వాడిలో ఇచ్చేటువంటి పాలు గుడ్లు కూరగాయల తోటి అన్నము ప్రతిరోజు అంగన్వాడికి వచ్చి గర్భిణీలు బాలింతలు పిల్లలు తినాలని సూపర్వైజర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ఆర్ కోమల దేవి కె కోమల ఏ కోమల సుజాత సునీత లలిత లత సుభద్ర జ్యోతి రమాదేవి సుమలత సుసాన్ శోభ సునీత రామ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు