
“Nutrition Month Celebrated in Mudigunta Anganwadi”
ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు,తాజా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలని అప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలు, మహిళలతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఆయమ్మ,గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు మహిళలు పాల్గొన్నారు.