జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతిరోజు తగు పోషక విలువలు కలిగిన తాజా ఆకుకూరలు, పాలు, గుడ్లు, తృణ దాన్యాలు ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎదుగుదల గురించి నెల నెల అంగన్వాడీ కేంద్రంలో బరువులు చూపించుకోవలనీ తల్లులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత , అంగన్వాడీ టీచర్స్ విజయ , అంజలి , జ్యోతి , అంగన్వాడీ హెల్పేర్స్ మరియు ఆశ కార్యకర్తలు , గర్భిణీలు , బాలింతలు , కిషోర బాలికలు పాల్గొనడం జరిగింది.