జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన,నులిగొండ భాస్కర్ , నియామకం చేయడం జరిగింది ,నేడు జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల విభాగం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర టిపిసిసి దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఈ సందర్భంగా ఒక ప్రకటన లో,తెలిపారు, ఇట్టి నియామకానికి సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి దుదిల్ల శ్రీధర్ బాబు కి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి,కరీంనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి చైర్మన్ ముత్తినేని వీరయ్య కి మరియు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ సోదర సోదరీమణులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు దివ్యంగా సోదర సోదరీమణులు పార్టీ కొరకు కష్టపడ్డ వారికి పదవులు అవే దగ్గరికి వస్తాయని ఇన్నేళ్లకు పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఫలితం దక్కిందని పలువురు దివ్యంగా సోదర సోదరీమణులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల విభాగం నాయకులు మొగిలి లక్ష్మయ్య, జగదీష్, అజీజ్, రాజయ్య మరియు లక్ష్మి రాజం,దివ్యంగ సోదర సోదరీమణులు పాల్గొన్నారు,
కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నులిగొండ భాస్కర్!!!!
