ఎన్టీఆర్ – హృతిక్ ఒకవైపు, రజనీ – నాగ్ మరోవైపు. వార్ 2 వర్సెస్ కూలి
రెండు మల్టీస్టారర్స్ ఢీ కొట్టబోతున్నాయి.
ఓ సినిమాలో యంగ్ స్టార్స్ – మరో సినిమాలో సీనియర్ స్టార్స్.
రెండూ తెలుగువారి ముందుకు అనువాద రూపంలోనే వస్తున్నాయి.
ఆ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతూండడంతో థియేటర్ల సమస్య తలెత్తింది.
ఇంతకూ ఆ రెండు మూవీస్ ఏవి? వాటి కథాకమామిషు ఏంటో చూద్దాం.
యంగ్ స్టార్ హీరోస్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ యన్టీఆర్ (Jr NTR) నటించిన ‘వార్ 2’ (War 2) ఓ వైపు, మరోవైపు సీనియర్ స్టార్స్ రజనీకాంత్ (Rajinikanth), నాగార్జున (Nagarjuna) అభినయించిన ‘కూలి’ (Coolie) జనాన్ని అలరించడానికి ముస్తాబయ్యాయి.
ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం!.
రెండు చిత్రాలు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యాయి.
వీటిలో ‘వార్ 2’ ఒరిజినల్ హిందీ కాగా, ‘కూలి’ తమిళ చిత్రం.
రెండు సినిమాలు దక్షిణాది నాలుగు భాషల్లోనూ, హిందీలోనూ విడుదలవుతున్నాయి.
రెండు సినిమాలకు క్రేజ్ నెలకొంది.
దాంతో దేశవ్యాప్థంగా థియేటర్ల పట్టడం మేకర్స్ కు ఛాలెంజ్ గా మారింది.
‘వార్ 2’ మూవీ నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ వారికి ఉత్తరాదినే కాకుండా, దక్షిణాదిన సైతం పట్టుంది.
దాంతో దేశంలోని 30కి పైగా ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ ను రెండు వారాల పాటు తమ ‘వార్ 2’ కోసం రిజర్వ్ చేసుకున్నారని టాక్.
దీని కోసం యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఓ ప్రత్యేక ఒప్పందం కూడా చేయించుకుందని విశేషంగా వినిపిస్తోంది.
ఇక తెలుగునాట యన్టీఆర్ కారణంగా ‘వార్ 2’కే ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
‘కూలి’ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు దక్షిణాదిన మంచి పట్టుంది.
‘వార్ 2’ సినిమా మొదటి భాగంలోనూ హృతిక్ రోషన్ నటించి ఆకట్టుకున్నారు.
అయితే ప్రస్తుతం గ్లోబర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న యన్టీఆర్ ఈ చిత్రంలో నటించడం వల్ల ‘వార్ 2’కు మరింత క్రేజ్ పెరిగింది.
దాంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేతలు దేశవ్యాప్తంగా ఈ సినిమాను సొంతగా రిలీజ్ చేసే ప్రయత్నంలోనూ ఉన్నారు.
అయితే ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి లోకేశ్ కనగరాజ్ అంత క్రేజ్ లేదు.
అయాన్ తెరకెక్కించిన చిత్రాలలో ‘యే జవానీ. యే దీవానీ’ ఘనవిజయం సాధించింది.
ఇంతకు ముందు ఆయన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ అంతగా మురిపించలేక పోయింది..
ఈ నేపథ్యంలో ‘వార్ 2’కు హీరోలు ఇద్దరు, హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ఇక ‘కూలి’లో డైరెక్టర్ తో పాటు రజనీకాంత్, నాగార్జున కాంబో, అలాగే ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రలతోపాటు ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే కేమియో అప్పియరెన్స్ కూడా ఆకర్షణగా ఉన్నాయి.
ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు.
‘వార్ 2’ కు ప్రీతమ్ సంగీతం సమకూర్చారు.
ఏ రీతిన చూసిన ‘కూలి’కి చాలా ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి.
‘వార్ 2’లో యన్టీఆర్ యాక్టింగ్ పెద్ద అసెట్ గా నిలుస్తుందని బాలీవుడ్ టాక్.
మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా క్రియేట్ చేస్తుందో, ఏది పైచేయి సాధిస్తుందో, లేక రెండూ తమ బడ్జెట్ కు తగ్గ సక్సెస్ నమోదు చేస్తాయేమో చూద్దాం.