
సిరిసిల్లలో జాతీయ గృహ ప్రయాణాలపై ఎన్ఎస్ఓ సర్వే
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని ఈరోజు జాతీయ గృహ ప్రయాణాలపై ఎన్.ఎస్.ఓ సర్వేజాతీయ గణాంక పథకాల అమల్లో భాగంగా దేశీయ పర్యటక వ్యయం జాతీయ గృహప్రయాణాలపై అధికారులు , బుధవారం సర్వే నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో దేశీయ పర్యాటక వ్యయం నిర్వహించే సర్వేతో పర్యటన వేయ సమాచారం ఆధారంగా వస్తువులు సేవలను కొలిచేందుకు సాటిలైట్ అకౌంట్ తెరిచి ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రూపొందించి పర్యాటక మంత్రిత్వ శాఖకు అందిస్తామని జాతీయ గణాంక శాఖ అధికారి,కరీంనగర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ కార్యాలయ అధిపతి గోవర్ధన శ్రీనివాసరావు తెలిపారు దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న జాతీయ గృహప్రయాణ సర్వేతో ప్రజా రవాణా వినియోగంపై పూర్తి సమాచారం లభించేలా ప్రజల ప్రయాణ ప్రవర్తన పై సమాచారం సేకరించి రైల్వే మంత్రి శాఖకు అనుకూలంగా మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికై నిజమైన డిస్టినేషన్ మాట్రిక్స్ ను రూపొందిస్తామని సేకరించిన కుటుంబ సమాచారాన్ని ఎక్కడ బహిర్గతం చేయకుండా అభివృద్ధి ప్రణాళిక విధాన నిర్మాణానికి ఎన్ఎస్ఓ ఉపయోగిస్తారని తప్పుడు సమాచారంతో ప్రభుత్వ పాలనలో తప్పిదాలకు దారి తీస్తాయాని కాబట్టి ప్రజలు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని గోవర్ధన శ్రీనివాసరావు కరీంనగర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ కార్యాలయ అధిపతి కోరారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండి కాదిర్ పాష మున్సిపల్ మేనేజర్ రామ్మోహన్ రాయ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి కృష్ణ ఎం.పీ.ఎస్.ఓ ఎమ్మార్వో, ఎంపీడీవో, జాతీయ గణాంక శాఖ అధికారులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, రావి కంటి వెంకటేష్, ముక్కు కృష్ణారెడ్డి,మరియు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ మున్సిపల్ బిల్ కలెక్టర్లు మెప్మా సెక్షన్ ఆర్పీలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.