రంగ రంగ వైభవంగా, హాలిఫాక్స్, కెనడాలో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు 2024

* కెనడా లోని హాలిఫాక్స్ &. డార్ట్ మౌత్ వాసులు మన భారత సంస్కృతి and భారత సంప్రదాయాలను కెనడా నోవా స్కోషియా హాలిఫాక్స్ నగరం లో సగర్వంగా వైభవంగా ప్రదర్శించారు

శ్రీ విశాల్ భరద్వాజ్ మరియు వారి బృందం; CEO జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి 27,000 మంది కి పైగా ముఖ్యం గా కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు హాజరయ్యి వేడుకలను ఘనంగా, రంజితంగా నిర్వహించారు.

శ్రీమతి మరియు శ్రీ శ్రీహరి రెడ్డి చల్లా మన దేశం/రాష్ట్రం తరఫున కార్యకలాపాలను నిర్వహించారు. శ్రీహరి గారి బృందం, శ్రీ మరియు శ్రీమతి సురేష్ ప్రియాంక, మిస్ శ్రీలేఖ, శ్రీ మరియు శ్రీమతి చంద్ర శ్రీలేఖ, శ్రీ మిలింద్,శ్రీ శ్రీకాంత్, చిరంజీవి రోహిత్, చిరంజీవి సోను, శ్రీ మరియు శ్రీమతి ప్రదీప్ సౌజన్య, మిస్ ఆస్తా, శ్రీమతి కృష్ణవేణి, శ్రీమతి రత్నం, శ్రీమతి శ్యామల, మిస్ సాత్వికీ మరియు మిస్ కావ్య ఉన్నారు, భారతీయ సంస్కృతిని ప్రదర్శించారు, దీనిలో భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతం మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ఉన్నాయి. అదనంగా, ఈ కార్యక్రమంలో భారతీయ దుస్తుల స్టాల్ మరియు భారతీయ ఆహార స్టాల్ ను ఏర్పాటు చేసి మన సంస్కృతిని ప్రోత్సహించారు.

ఏ దేశ మేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపర నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ, 4-7 ఏళ్ల పిల్లలు భారతీయ నృత్యం మరియు శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించారు, ఇది భారతీయ్యులకి , చుట్టూ పక్కల ప్రాంతీయాయులకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చిరంజీవి శిబి నేతని కర్రసాము ప్రదర్శన ఇచ్చారు, చిరంజీవి హర్ష లైట్ మ్యూజిక్ పాడారు, కుమారి జనని భారతనాట్యం ప్రదర్శించారు, కుమారి సంగీత ఒడిసి నృత్యం ప్రదర్శించారు మరియు ఆరాధ్య కుచిపూడి ప్రదర్శించారు. హాలిఫాక్స్ లోని అందరు భారతీయుల కి ఇది ఒక కనులవిందు మరియు ఇతర సంస్కృతుల ప్రజలు కూడా ఈ ప్రదర్శనలను ఎంతో ఆనందించారు

వివిధ వంటకాల షడ్రుచులతో, కార్య క్రమాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా జరిగిన తీరు అందరిని ఆకట్టుకున్నది; వేడుకలను ఘనంగా నిర్వహించిన, పెద్దలు, వాలంటీ ర్లు, ముఖ్యంగా కార్యక్రమానికి విచ్చేసిన అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు కు మెచ్చుకొన్నారు.

కెనడా నోవా స్కోషియా వేడుకలు అంగరంగ వైభవంగా, ఘనంగా ముగిసినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!