
మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి
నడి కూడ,నేటి ధాత్రి:
అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు.నడికూడ మండలం కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు మంగళహారతులతో, ఘన స్వాగతం పలికారు. గడప గడపకి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజవర్గన్ని అభివృద్ది పథంలో ఉంచిన నాయకుడు చల్లా ధర్మారెడ్డిని ప్రతిఒక్కరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.అనునిత్యం ప్రజల కష్ట సుఖాల్లో ఉండే నాయకుడికి ఓటువేసి పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలన్నారు. అభివృద్ధిలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.మహిళకు తెలంగాణ రాష్ట్రం భరోసాగా నిలిచిందన్నారు.మహిళలు మరోసారి ఆశీర్వదించి చల్లా ధర్మారెడ్డి కి భారీ మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,గ్రామ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.