ఈ ప్రక్రియను మరో 25ఏళ్లు వాయిదా వేయాలంటున్న జేఏసీ
ఉత్తరాది రాష్ట్రాల నిర్లక్ష్యం, దక్షిణాదికి ఇబ్బందికరం
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు దన్నుగా నిలవని ఉత్తరాది పార్టీలు
ప్రాంతీయ ప్రయోజనాలే ఇందుకు కారణం
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టలేవన్న సత్యం మరోసారి బట్టబయలు
గుంపులో గోవిందయ్య స్థాయికి దిగజారిన కాంగ్రెస్
దక్షిణాదికి తానే నాయకుడుగా ఎదగాలని స్టాలిన్ తహతహ
హైదరాబాద్,నేటిధాత్రి:
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 22న చెన్నైలో జరిగిన సమావేశంలో ఏడు రా ష్ట్రాలనుంచి ప్రజాప్రతినిధులు హాజరుకావడమే కాకుండా, ఈ అంశంపై ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం తాజా పరిణామం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కర్ణాటక, తెలంగాణ, ఒడిషాల నుంచి సీనియర్ నాయకులు సభ్యులుగా వున్నారు. తాము నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతి రేకం కాదని, కాకపోతే ఇది, సామాజిక న్యాయం, జనాభా నియంత్రణతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేవిధంగా వుండకూడదని సమావేశంలో పా ల్గన్న నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం తాము నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించలేమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే పునర్విభజనలో పారదర్శకతల లేదంటూ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.సి.పి. అధినేత జగన్‌మోహన్ రెడ్డి కూడా మార్చి 22న ప్రధానికి ఒక లేఖరాస్తూ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో పారదర్శకతను పాటించాలని కోరినప్పటికీ, ఈ సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతి నిధిని పంపకపోవడం గమనార్హం. ఇక ఆహ్వానం అందిన పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రతినిధులను పంపలేదు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఓటర్ల గుర్తిం పు కార్డుల సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో మరో సమస్యలో తలదూరిస్తే తమ రాష్ట్రసమస్య బలహీనపడుతుందని అందువల్లనే మిన్నకుండిపోయామని పార్టీ తెలిపింది. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గనడం గమనార్హం. తమిళనాడు, అంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన మామూలు ధోరణిలో మాట్లాడుతూ ఈ పునర్విభజన ప్ర క్రియ దక్షిణాది రాష్ట్రాల నెత్తిన కత్తిలా వేలాడుతోందన్నారు. 1976నాటి కేంద్ర ప్రభుత్వ కు టుంబ నియంత్రణ విధానాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఈ రాష్ట్రాలను శిక్షించడం తగదని పే ర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటైౖ నిలబడాలని కోరారు. ‘జనాభాపరంగా ఈ రాష్ట్రాలను శిక్షించడం అన్యాయ’మన్నది ఆయన వాదన. ఏతావాతా జాయింట్ యాక్షన్ కమిటీ మాత్రం 1971 జనగణన ప్రకారమే నియోజక వర్గాల సంఖ్యను కొనసాగించాలని, ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మరో 25 సంవత్సరాల పాటు వాయిదావేయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2021 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేప ట్టాలని భావిస్తోంది. అంటే ఇప్పటికే ఇది ఆలస్యమైంది. అందువల్ల 2026లో చేపట్టబోయే జనగణన ప్రకారం ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలన్నది కొందరి అభిప్రాయం. ఇందుకోసం మళ్లీ రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి వుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించిన వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం కేటాయింపులు తగ్గిపోయి ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు డీలిమిటేషన్ ‘బాంబు’ వాటిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.
పరిశీలిస్తే చెన్నైలో జరిగిన ఈ డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశానికి ఎన్డీఏ యేతర పక్షాల నుంచిపూర్తిస్థాయి మద్దతు లభించలేదన్న అంశం స్పష్టమైంది. ముఖ్యంగా ఫెడరల్ యాంటీ`బీజేపీ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో అభిప్రాయ భేదాలు స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స మాజ్‌వాదీ పార్టీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్‌లు గైర్హాజరీకి కారణాలు ఏమి చెప్పినా, డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరిగి ప్రయోజనం కలుగుతున్నప్పుడు, సీట్లు తగ్గే దక్షిణాదికి మద్దతివ్వడానికి అవి ముందుకు రాలేదన్నదిస్పష్టమైంది. అయితే ఈ పార్టీలు గైర్హాజరైనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల సమావేశం తన అభిప్రా యాలను స్పష్టంగా వెల్లడిరచడంలో విజయం సాధించిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్‌పై ఇప్పటివకు ఎటువంటి రోడ్‌మ్యాప్ ప్రకటించలేదు. కాకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం, ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగబోదంటున్నారు. అది ప్రాతిథ్య పరంగానా లేక నైష్పత్తిక ప్రాతినిధ్య పరంగానా అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు.
లోక్‌సభలో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఒక పౌరుడు, ఒక ఓటు అనే విధానంలో జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాల్సివుంటుంది. కానీ స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి నియోజకవర్గాల ఏర్పాటులో జనాభాను ప్రాతిపదికగా తీసుకున్న దాఖలాలు లేవు. పరిపాలనాపరమైన సౌలభ్యత,దేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం వుండాలన్న ప్రాతిపదికనే అనుసరించినట్టు గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా లక్షద్వీప్, లద్దాఖ్ నియోజకవర్గాలు ఈవిధంగా ఏర్పడినవే. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే నియోజకవర్గ ఏర్పాటుకు తగినంత జనాభా ఈ ప్రాంతాల్లో లేదు. అందువల్ల భౌగోళిక ప్రాతిపదికన వీటి ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం జనాభా ప్రాతి పదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, దెబ్బతినేవి దక్షిణాది రాష్ట్రాలే. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియపై జరుగుతున్న చర్చలు ప్రధానంగా రెండు అంశాలను తెరపైకి తెస్తున్నాయి. మొదటిది ఆర్థికం కాగా రెండవది జనాభా ప్రాతిపదిక. ఈ రెండు అంశాలు దేశ పురోభి వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జనా భా నియంత్రణను పాటించి, ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా ఉద్యోగావకాశాల కల్పనలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది కంటే ఎంతో ముందంజలో వున్నాయి. ఈ విషయంలో తీవ్ర నిర్ల క్ష్య వైఖరి అనుసరించిన ఉత్తరాది రాష్ట్రాలు పెరిగిన జనాభా భారంతో పాటు, పేదరిక వృద్ధి, కుంటుపడిన ప్రగతి వంటి అనేక అవలక్షణాలతో కునారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ లేవనెత్తిన అంశాలను కేంద్రం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళితే, ఉత్తర`దక్షిణ ప్రాంతాల మధ్య ప్రాధాన్యతల్లో తేడాలు ఏర్పడతాయి.
చెన్నైలో జరిగిన సమావేశం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న స్వార్థపరత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడంలో కూడా వీటి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్త్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఏదోవిధంగా ప్రముఖంగా ప్రచారంలో వుండాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగమే భాషా వివాదం మరియు డీలిమిటేషన్ వివాదం. ఈ రెండు అంశాల్లో దక్షిణాదికి తనను తాను నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలు, పక్కాగా స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయి. ఇక్కడ వాటికి బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టేకంటే, తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుంటే చాలన్న ధోరణి మరోసారి బట్టబయలైంది. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ ప్రతినిధులను చెన్నైకి పంప డం వల్ల డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు పెరిగే సీట్లు తగ్గిపోవు. తమ సహచర తమ సహచర రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దన్నుగా నిలవకుండా తప్పించుకోవడం వాటికే చెల్లింది. ఇటువంటి పార్టీలు, దేశ ప్రయోజనాలకోసం పనిచేస్తాయని ఎట్లా అనుకోవాలి? జాతీయభావంలేని పార్టీల వల్ల దేశానికి తీరని నష్టం. ఎవరికి వారే నాయకులం కావాలనుకుంటారు పరస్పర సహకారం విషయంలో ముందుకు రారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమస్యలను లేవనెత్తి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప, వీటివల్ల రాష్ట్రాలకు, దేశానికి ఎటువంటి ప్రయోజనం వుండబోదు. కుటుంబపాలనతో రాచరికాన్ని వెలగబెట్టడం తప్ప ప్రజా స్వామ్యం వీటికి ఎంతమాత్రం పట్టదు.