రాజన్న సిరిసిల్ల టౌన్ నేటి ధాత్రి
అంగన్వాడీ ఉద్యోగులను, ఆయాలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ ఎదుట నిరవాదిక సమ్మె చేపట్టారు ఈ రోజు 9వ రోజు
అంగన్వాడి ఉద్యోగ నాయకురాలు మాట్లాడుతూ
ప్రభుత్వం వెంటనే అంగన్వాడి ఉద్యోగులను రెగ్యులర్
చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా
అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ప్రతి నెల 26 వేల జీతం చెల్లించాలని
10 లక్షల ప్రమాద బీమా ప్రకటించాలని ఆయాలకు 5 లక్షల రూపాయలు ప్రమాదంలో మరణిస్తే వారి వారసులకు కేటాయించాలని పదవి విరమణ వయసు 60 సంవత్సరములు వరకు పొడిగించాలని
పదవి విరమణ పొందిన తర్వాత జీవితంలో సగం జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అంగన్వాడి టీచర్స్,
అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.