# నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి..
# నర్సంపేట ఆర్డీవో,ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి
నర్సంపేట,నేటిధాత్రి :
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాసన సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ నేటి నుండి నర్సంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రారంభం కానున్నదని 103 అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి,ఆర్డీవో కృష్ణ వేణి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
రాజకీయ పార్టీల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రిటర్నింగ్ అధికారి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించడం జరిగిందని వారు అన్నారు.నవంబర్ 3 నుండి 10 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగునని,ఈ ప్రక్రియలో ఉదయం 11.00 నుండి సాయంత్రం 3.00 వరకు నామినేషన్లు స్వీకరించబడునని వారు అన్నారు.ప్రభుత్వ సెలవు దినం రోజున నామినేషన్లు స్వీకరించ బడవని వారు పేర్కొన్నారు.100 మీటర్ల పరిధిలో వాహనాలు అనుమతించ బడవని తెలిపారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును యువతి యువకులు బాధ్యతగా ఓటును వినియోగించాలని కోరారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 283 ఉన్నాయని, మొత్తం ఓటర్లు 2,26,617 ఉండగా అందులో పురుషులు 1,11,870, స్త్రీలు 1,14,742, ఇతరులు 5 అని వివరించారు.ఇందులో 80+ ఓటర్లు 4070, పిడబ్ల్యుడి ఓటర్లు 5945 గా ఉన్నాయని అన్నారు.నియోజక ల్వర్గం పరిధిలో మహిళ పోలింగ్ కేంద్రాలు 5 ఉన్నాయని, పిడబ్ల్యుడి పోలింగ్ కేంద్రం 1,మోడల్ పోలింగ్ కేంద్రాలు 5,యూత్ పోలింగ్ కేంద్రం 1 ఉన్నదని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేయుటకు రెండవ విడత పోలింగ్ అధికారుల శిక్షణ కేంద్రాలలో ( ఫెసిలిటేషన్ కేంద్రాలలో) పోస్టల్ బ్యాలెట్ వేయుటకు ఏర్పాటు చేయనైనదని వారు అన్నారు.
# నియోజకవర్గ ఏఆర్వోలతో సమీక్ష…
ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కె. కృష్ణ వేణి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల లో నియోజకవర్గ ఏఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క ఏఆర్వో ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని వారు అన్నారు.
ఎన్నికల నిర్వహణలో
అకౌంటింగ్ టీమ్, విడియో వ్యూవింగ్ టీంలు,ఫ్లయింగ్ స్కాడ్స్ టీమ్ 3 షిఫ్ట్ లు గా మూడు టీమ్ లు 24/7 పనిచేస్తున్నాయని అధికారిని అన్నారు. ఎన్నికల కమిషన్ నిభందనలు మేరకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు తగు సలహాలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గ ఏఅర్వోలు విశ్వ ప్రసాద్, ఫణికుమార్, రాజేష్,కిరణ్ కుమార్,రాజకుమార్,రావి చంద్రా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.