
కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బిఆర్ఎస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ సతీమణి దీవెన, కుమారుడు, కూతుర్లతో నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేస్తున్న పత్రాలను స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని అధిక సంఖ్యలో విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో చొప్పదండి లో గల ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల ఎంపీపీ మేని స్వర్ణలత రాజనర్సింగరావు, జెడ్పిటిసి పునుగోటి ప్రశాంతి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, మండల రైతు బంధు సమన్వయ కమిటీ అధ్యక్షులు అంకం రాజేశం, కొడిమ్యాల మండల అధ్యక్షులు పులి వెంకటేష్, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కో ఆప్షన్ నెంబర్ నజీర్, నల్లగొండ గ్రామ సర్పంచ్ పిల్లి మల్లేశం, ఎంపీటీసీ చీకట్ల సింధు మహేందర్,బిఆర్ఎస్ పార్టీ, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.