సంచార జాతి పూసల కులాన్ని ఎంబీసీ లో చేర్చాలి

పూసల సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గుంటిపెల్లి సంపత్

ఇందిరా పార్క్ వద్ద 7 న జరగబోవు నిరసన కార్యక్రమాన్ని విజయవంత చేయాలి

పూసల తల్లుల తండ్రుల గోస ను ప్రభుత్వం పట్టించుకోవాలి

జీవనోపాధి కోసం గాజుల గంప నెత్తిన పెట్టుకొని ఊరు ఊర మా కులాన్ని గుర్తించాలి

హన్మకొండ, నేటిధాత్రి:

సంచార జాతి పూసల కులాన్ని ఎంబీసీ లో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను విలేకరులక సమావేశంలో హనుమకొండ జిల్లా లో పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి సంపత్ కుమార్ మరియు జనరల్ సెక్రటరీ పన్నీరు రాజశేఖర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చెయనైనది.ఈ సందర్బంగా మాట్లాడుతూ పూసల తల్లి నెత్తిన గంప పూసల తండ్రి సైకిలుకు చెత్తీర్లు తాళాల రిపేరు చేసుకుంటూ ఊరు ఊరు తిరిగి జీవనం సాగించే మా పూసల కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ లో కలపాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్నో సందర్భాలలో మా పూసల కుల పెద్దలు వివిధ జిల్లాల నుంచి పలుమార్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు విజ్ఞాపన పత్రాలు ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వము ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి పూసల కులాన్ని ఎంబీసీ లో చేర్చాలని 7-10-2023 తారీఖు శనివారం రోజున హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర పూసల తల్లుల తండ్రుల గోస నినాదంతో తెలంగాణ రాష్ట్ర పూసల కమిటీ పూసల చైతన్య వేదిక మరియు తెలంగాణ రాష్ట్ర పూసల హక్కుల పోరాట సమితి వారి పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండలాల పూసల బంధువులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను మరియు 33 జిల్లాల పూసల కులస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పూసల కుల బంధువులందరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలోహనుమకొండ జిల్లా అధ్యక్షుడు గుంటిపెల్లి సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పన్నీరు రాజశేఖర్, కోశాధికారి ముదురుకోళ్ల రాజు, మరియు జిల్లా కమిటీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!