Nodal Officer Inspects Mid Day Meal at Chityala Junior College
కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన నోడల్ ఆఫీసర్ .
చిట్యాల, నేటిదాత్రి :
ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిట్యాలలో నోడల్ ఆఫీసర్ శ్రీ వెంకన్న పర్యటన విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కళాశాలలో అమలవుతున్న విద్యా, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీదేవి పాల్గొన్నారు, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యత, శుభ్రత, పోషక విలువలపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి. శ్రీదేవి గారు మరియు కళాశాల అధ్యాపక సిబ్బంది తమ స్వంత విరాళాలతో మరియు దాతల సహాయంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సామగ్రిని అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణ ,హాజరు శాతం మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అదేవిధంగా, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ చర్యతో విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అధ్యాపకులు పేర్కొన్నారు.
నోడల్ ఆఫీసర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా అవసరాలు తెలుసుకొని, క్రమశిక్షణతో చదువుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
