* బీఆర్ఎస్ పార్టీ నాయకులు :ఐరెడ్డి మల్లారెడ్డి
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, మానువాడ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్,బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యువజన విభాగం పక్షాన క్షేతస్థాయిలో కృషి చేయాలని కోరారు.
చొప్పదండి నియోజకవర్గాన్ని రవిశంకర్ పాలనలో కేసీఆర్,కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ల సహకారంతో నిధులు దండిగా మంజూరు చేయించి ఎంతగానో అభివృద్ధి చేశారని,మూడోసారి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, రెండోసారి చొప్పదండి ఎమ్మెల్యే గా సుంకె రవిశంకర్ ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలుపు తధ్యమని, గులాబీ దండును అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.