https://epaper.netidhatri.com/view/291/netidhathri-e-paper-12th-june-2024%09/3
`ఉద్యమానికి పనికొచ్చిన వాళ్లు పాలనకు పనికి రాలేదు.
`అధికారం చెలాయించిన వాళ్లు ఉద్యమకారులకు సహకరించలేదు.
`ఉద్యమ కారులంటేనే కేసిఆర్ భయపడ్డాడు.
`ఎన్నటికైనా నిలదీస్తారని కలలో కూడా ఉలికిపడ్డాడు.
`ఉద్యమ ద్రోహులకు పదవులిస్తే అణిగిమణిగి వుంటారనుకున్నారు.
`అవకాశవాదులు తమ బుద్ది చూపించుకున్నారు.
`ఇప్పుడు మళ్ళీ కేసిఆర్‌కు ఉద్యమ నేతలే దిక్కయ్యారు.
`అయినా కేసిఆర్ మారుతాడని ఎవరికీ నమ్మకం లేదు.
`కేసిఆర్ చంచల స్వభావం కుదురుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు.
`కేసిఆర్ తన నీడనే తాను నమ్మలేడు.
`పార్టీని పెంచి పెద్ద చేసిన హరీష్‌నే ఒక దశలో పక్కనపెట్టాడు.
`ప్రాణం పెట్టిన ఈటెలనే దూరం కొట్టుకున్నాడు.
`నిశీదిని తనకు తాను పిలిచి తెచ్చుకున్నాడు.
`నిన్నటిదాకా పొగిడిన వాళ్లే తిడుతుంటే వింటున్నాడు.
`ఉద్యమ కారులంతా బిఆర్‌ఎస్‌ను నిలబెట్టారు.
`ఉద్యమ ద్రోహులను నమ్మితే కూల దోశారు.
`కాలం గొప్పదని కేసిఆర్‌కు తెలుసు.
`అధికార మత్తులో అన్నీ మర్చిపోయాడు.
`జనమే జన నేత అని పొగిడి పదే పదే గెలిపించారు.
`ఇప్పుడు వాళ్లే ‘‘జనసంపద మేత’’ అని ఓడిరచారు.
`ఇప్పుడు అందరూ కేసిఆర్‌ను తిట్టేదాకా తెచ్చున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
అవసరానికి పనికి వచ్చిన వాళ్లను, ఆపదలో ఆదుకున్నవారిని జీవితంలో మర్చిపోవద్దు. అడుగడుగునా మనుకు తోడుగా వున్నవారిని ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్లు చూడకూడదు. కాని ఇవి రెండూ కేసిఆర్ చేశాడు. ఈ విషయాన్ని ఆది నుంచి అందరూ చెబుతూనే వున్నారు. అయినా కేసిఆర్ పట్టించుకోలేదు. అయినా తెలంగాణ సమాజం మొత్తం కేసిఆర్ వెంట నడిచింది. ఆయనకు అండగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్ కోసమే నిలిచింది. కారణం కేసిఆర్ జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ సాధిస్తానని చెప్పారు. మిగతా నేతలు ఎవరూ చెప్పలేదా? అంటే చెప్పారు. కాని ఆఖరు దాకా నిలబడలేదు. సుదీర్ఘకాలం జై తెలంగాణ వాదాన్ని ఎత్తుకోలేదు. మధ్యలోనే విశ్రమించారు. పదవుల కోసం ఆశ పడ్డారు. రాజకీయాల కోసం తెలంగాణ వాదాన్ని వదిలేశారు. అలా వదిలేసిన వారు తెలంగాణ సమాజంలో అవకాశవాదులుగా మిగిలిపోయారు. అయితే రాజకీయ లబ్ధి కోసం నిలడడం కన్నా, ప్రజల తమకు తాముగా తనకు అండగా నిలిచే రాజకీయాలు కేసిఆర్‌కు బాగా ఉపయోగపడ్డాయి. తనను తాను రాజకీయంగా ఎత్తుకు ఎదగడానికి ప్రజలే తోడుగా నిలిచే రాజకీయాలు ఎలాంటి తల నొప్పులు లేకుండా సాగాయి. అదే కేసిఆర్‌ను నచ్చింది. తాను ఒకరి దగ్గర టికెట్ ఆశించడం కన్నా, తానే టికెట్లు ఇచ్చే రాజకీయం ఆయనకు దరి చేరింది. అందుకే కేసిఆర్ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టలేదు. పదువులు ఎలాగూ ప్రజలు ఇస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం పదే పదే రాజీనామాలు చేసినా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. తన కోసం తెలంగాణ సమాజం మొత్తం కదులుతోంది. అంతకన్నా ఒక నాయకుడికి ఏం కావాలి. ఎన్ని రాజకీయాలు చేసినా కూడనంత సంపద పోగౌతోంద. ఒకప్పుడు మంత్రిగా పనిచేసినా లేని ఆస్దులు జై తెలంగాణ అనగానే సమకూరాయి. అప్పటికే రెండు మూడుసార్లు ఎమ్మెల్యేల అయినా లేని భూములు వచ్చాయి. ఇంతకన్నా ఏ రాజకీయంలో, పదువుల్లో దొరుకుంది. కాలం కలిసి వస్తే బంటు కూడా రాజయ్యే అదృష్టం కలగొచ్చు. అలాంటి అదృష్టం, అందలం కేసిఆర్‌కు వచ్చేందుకు జైతెలంగాణ అన్న ప్రజలు, జై కేసిఆర్ అన్న లక్షలాది మంది పార్టీ శ్రేణులే కారణం. కాని ఆయన వారిని విస్మరించారా? ప్రభుత్వంలోకి వచ్చాక వారిని దూరం పెట్టారా? అటుకులు బుక్కి పోరాటం చేసిన వాళ్ల ఆస్దులు కరిగిపోయాయా? అంటే ప్రతి కార్యకర్త అవుననే అంటారు. పదేళ్ల పాటు బిఆర్‌ఎస్ అదికారంలో వున్నా ఏ ఒక్క కార్యకర్త సంతోషంగా లేదు. కారణం కేసిఆర్ తన తెలంగాణ ప్రయోజనాల పేరుతో కార్యకర్తలను విస్మరించాడు. తన కుటుంబం మాత్రమే లాభపడేలా చేసుకున్నాడు? ఇది పైకి చాలా మంది చెబుతున్నారు. కొందరు మనసులోనే తిట్టుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పనికి వచ్చిన ఎంతో మంది ఉద్యమ కారులు, బిఆర్‌ఎస్ అదికారంలోకి వచ్చాక పనికి రాలేదు.
స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో కూడా ఖర్చు పెట్టుకోగల వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. వాళ్లే నాయకులుగా చెలామణి అయ్యారు. ఉద్యమ కాలంలో ఆస్ధులు పోగొట్టుకున్నవాళ్లంతా పేదవాళ్లయ్యారు. పార్టీ కార్యకర్తలుగానే మిగిలిపోయారు. నిజానికి 2019లోనే బిఆర్‌ఎస్ ఓడిపోతే ఇప్పటికే బిఆర్‌ఎస్ కనుమరుగయ్యేది. కాని కేసిఆర్ అదృష్టం బాగుండి మళ్లీ గెలిచింది. దాంతో కార్యకర్తల జీవితం పెనం నుంచి పొయ్యిలో పడినట్లైంది. వారికి వస్తాయనుకున్న అవకాశాలు కూడా రాలేదు. అప్పటికే కారు నిండిపోయింది. ఉద్యమ సమయంలో కనీసం తెలంగాణ అని ఏనాడు అనని నేతలంగా బిఆర్‌ఎస్ చేరారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లంతా బిఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టారు. వాళ్లంతాపదవులు పొందారు. కాని తెలంగాణ ఉద్యమ కారులు మాత్రం పదవుల లేక, పార్టీలో చేరిన తెలంగాణ ద్రోహలు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. వారికి ఊడిగం చేసే కార్యకర్తలుగా మారారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాదు, 2014కు ముందు కూడా బిఆర్‌ఎస్‌లో ఎవరూ చేరలేరు. కాని కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరువు నిండగానే కప్పలు వచ్చి చేరినట్లు చేరారు. ఆ సమయంలో బిఆర్‌ఎస్ బలోపేతమౌతుందని, తనకు ఎదురుండదని కేసిఆర్ అనుకున్నారు. వారికి పదవులు పంచితే తన ముందు అణిగి మణిగి వుంటారనుకున్నారు. ఒక వేళ ఉద్యమ కారులకే పదవులు ఇస్తే ప్రశ్నించడం అలావాటు వున్న ఏ ఉద్యమ కారుడు అణిగి మణిగి వుండేందుకు సిద్దంగా వుండడు. వారిలో ఆ ఉడుకు రక్తం ఉరకలెత్తుతూనే వుంటుంది. పదవులకంటే ముందు ఆత్మ గౌరవానికి విలువిస్తారు. ఇది కేసిఆర్‌కుతెలుసు. ఎందుకుంటే ఈటెల రాజేందర్ విషయంలో జరిగింది అదే..ఈటెల రాజేందర్ లాంటి నాయకులు పార్టీకి వుండడం కేసిఆర్ అదృష్టం. కాని అదృష్టాన్ని కాలదన్నుకున్నాడు. ఏ పార్టీలోనైనా కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీ నాది అనుకున్నప్పుడే అంకిత భావంతో పనిచేస్తారు. అందుకే పార్టీ నాదే అన్నంత గర్వంగా చెబుతారు. కాంగ్రెస్, బిజేపి లాంటిపార్టీలో వుండేంత అంతర్గత ప్రజాస్వామ్యం బిఆర్‌ఎస్‌లో లేదు. కాని అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే వుంటాయని కాదు. తెలుగుదేశంపార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే ఆ పార్టీకి ఇంకా తెలంగాణలో నాయకులు, కార్యకర్తలున్నారు. కాని బిఆర్‌ఎస్‌లో ఆ స్వేచ్ఛ లేదు. గులాబీ పార్టీకి నేను కూడ ఓనర్‌నే అన్నంత మాత్రాన ఈటెల రాజేందర్ కుర్చీ వేసుకొని కూర్చుంటాడా? కాని కేసిఆర్ ఒక్కసారి ఉలిక్కిపడాల్సి వచ్చింది. పైగా ఈటెల రాజేందర్ లాంటి వారికే స్వేచ్చ లేకపోతే ఇతర నాయకులకు ఏం స్వేచ్ఛ వుంటుంది. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే పలితాలు వెలువడిన సాయంత్రమే కేటిఆర్‌ను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటును చేశారు.
మహమూద్ అలీని ఒక్కడినే మంత్రి వర్గంలోకి తీసుకొని మూడు నెలల పాటు ఎలాంటి మంత్రి వర్గం లేకుండా పాలన సాగించాడు.
తర్వాతనైనా ఈటెల రాజేందర్, హరీష్‌రావులకు మంత్రి పదవులు ఇవ్వలేదు. తెలంగాణ సమజంలో పెద్ద చర్చ మొదలైంది. అప్పుడు గాని కేసిఆర్‌కు సోయి రాలేదు. కేసిఆర్ డిల్లీ రాజకీయాలు చూసుకుంటూ అక్కడే వుంటే తెలంగాణ రాజకీయాలను, అసెంబ్లీ వేధికను, తెలంగాన సమాజంలో ఉద్యమాన్ని చూసుకున్న నాయకుడు ఈటెల రాజేందర్. కాని ఆయనను కొంత కాలం పక్కన పెట్టి, వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వుండగానే ఈటెలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదిలా వుంటే హరీష్‌రావు లేకుండా కేసిఆర్ భుజాలకెత్తుకున్న తెలంగాణ ఉద్యమమేలేదు. ఎందుకంటే కేసిఆర్ ఆదేశాలతో తెలంగాణలోని ఊరూరు తిగిరి, తెలంగాణ జెండాలు ఎగరేసిని నాయకుడు హరీష్‌రావు. ఏ ఎన్నిక వచ్చినా పార్టీని గెలిపించే బాధ్యత తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన నాయకుడు హరీష్‌రావు. మరి అలాంటి నాయకుడిని కూడా కొంత కాలం పక్కన పెట్టడం తెలంగాణ సమజానికి నచ్చలేదు. ఇక తెలంగాణ వ్యతిరేకులను తెచ్చుకొని పార్టీని నింపుకోవడం వల్ల తెలంగాణ వాదులకు తీవ్ర అన్యాయం జరిగింది. అడుగుగడునా కేసిఆర్ ఎన్ని తప్పటగులు వేసినా రక్షించుకొంటూ, పార్టీని కాపాడుకుంటూ వచ్చిందే హరీష్‌రావు. హరీష్‌రావుకు ఇష్టం లేకున్నా, తెలంగాణ వ్యతిరేకులతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకురావాల్సివచ్చింది. అంతగా ప్రాధాన్యత వారికిచ్చి పార్టీలో చేర్చుకుంటే వారేమైనా కేసిఆర్‌తో వున్నారా? ఆఖరుకు మండలి చైర్మన్‌గా వున్నా గుత్తా సుఖేందర్‌రెడ్డికూడా పదవిలో వుండి కూడా కేసిఆర్‌కు దూరమయ్యారు. ఇలా కేసిఆర్ ఏరి కోరి ఎవరెవరినైతే తెచ్చుకున్నారో వాళ్లంతా పార్టీకి దూరమయ్యారు. కేసిఆర్ నాయకత్వాన్ని కాదుకొన్నారు. ఇప్పుడు కూడా వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. కాని కేసిఆర్‌ను నమ్ముకొని ఆయనకు తోడుగా వున్నవాళ్లెంతో మంది నాయకులు రాజకీయాలకు దూరమయ్యారు. అలాంటి వారిని రాజకీయాలకు దూరం చేసి, తనను వ్యతిరేకించిన వారికి రాజకీయ భవిష్యత్తునిచ్చి, చివరికి చివరికి తన రాజకీయ జీవితం గందరగోళంలోకి నెట్టుకున్నాడు. ఆఖరుకు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమ కారుడికి టికెట్ ఇవ్వమని ఎంత మొత్తుకున్నా, నిత్యం కేసిఆర్, కేటిఆర్‌లను తూర్పార పట్టిన రాకేష్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. ప్రజలు మరోసారి తిరస్కరించేలా చేసుకున్నాడు. దొంగలకు సద్దిగట్టి…ఉద్యమ కారులను ఎండబెట్టిన కేసిఆర్‌కు తెలంగాణ సమాజం కూడా గడ్టిపెట్టారు. ఓడిరచి పక్కన పెట్టారు. కారుకు స్ధానం లేకుండా చేశారు. బిఆర్‌ఎస్‌ను మర్చిపోయారు.