`మిల్లర్ల పాలిట శాపంగా మారుతున్న అధికారులు!
`సరిగ్గా వడ్లు వచ్చే సమయానికి సమస్యలు సృష్టిస్తారు?

`అదును చూసి కేసులు రాస్తామని బెదిరిస్తారు!
`చిన్న చిన్న మిల్లర్ల మీద తమ ప్రతాపం చూపిస్తారు.

`మిల్లర్లను వేదించుకు తింటారు.
`తాజాగా జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యాలు!

`ఆసిఫాబాద్ లో రెడ్ హాండెడ్‌గా ఏసిబికి చిక్కిన ఉదంతాలు.
`మిల్లర్లను వేధించడమే పనిగా పెట్టుకున్న అధికారులు.
`ఒకప్పుడు సివిల్ సప్లయ్ శాఖ అంటే ఒట్టిపోయిన ఆవు వంటిది.
`ఇప్పుడు అధికారులకు కావాల్సినంత పాడిగా మారిపోయింది.
`అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
`ఏళ్ల తరబడి ట్రాన్స్ఫర్లు కూడా లేకుండా పోయింది.
`రెవెన్యూ శాఖ నుంచి సివిల్ సప్లై శాఖకు డిప్యూటేషన్ పై వచ్చిన అవినీతి అధికారులకు సివిల్ సప్లై శాఖ వరంగా మారింది
`ఆసిఫాబాద్ లో అధికారుల ఒత్తిళ్లు భరించలేక ఓ మిల్లర్ల ఏసిబిని ఆశ్రయించారు?
`అయినా అధికారులు మారుతారన్న గ్యారెంటీ లేదు.
`ఇతర అధికారులు ఆ మిల్లర్‌కు సహకరిస్తారన్న నమ్మకం లేదు.
`ఆ మిల్లర్ వ్యాపారం సజావుగా సాగుతుందనే విశ్వాసం వుండదు.
`మరో జిల్లాలో బంగారం అమ్మి మరీ అధికారులకు లంచం ఇచ్చిన సందర్భం వుంది?
`అన్ని జిల్లాలలో ఇవే పరిస్థితులు దాపురించాయి.
`మిల్లర్లకు కష్టాలు మిగిల్చుతున్నాయి.
`కొందరి మిల్లర్ల జీవితాలు దినదిన గండంగా మారుతున్నాయి.
`మింగలేక, కక్కలేక మిల్లర్లు మధనపడుతున్నారు!
`ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టి వందల కోట్లతో కొత్త మిల్లులు నిర్మిస్తున్న రాష్ట్ర నాయకుల జోలికి ఈ అవినీతి అధికారులు వెళ్లారు?
`వందల కోట్ల బకాయిలున్న వారి జోలికి అధికారులు పోరు!
`చిన్న చిన్న మిల్లర్లను అధికారులు బతకనివ్వరు.
`ఇక వరుసగా సివిల్ సప్లై లోని అధికారుల అవినీతి బాగోతాలు మీ
‘‘నేటిధాత్రి’’లో
విసిగించడం, వేదించడం, లంచాలు తీసుకోవడం అధికారులకు రివాజు. సర్ధుకుపోవడం, అడిగింత ముట్టజేప్పడం ప్రజలకు అలవాటుగా మారింది. ఇక కొన్ని శాఖల్లో ఎన్ని లంచాలు తీసుకున్నా అదికారుల దాహంతీరదు. అధికారులు ఎప్పుడంటే అప్పుడు లంచాలు ఇవ్వక కొంత మంది వ్యాపారులకు తప్పదు. ఇదేం చట్ట బద్దం కాదు. అయినా వ్యాపారులకు తప్పదు. తప్పు చేయకుండా వ్యాపారులు లంచాలు ఎందుకిస్తారు? అనే ప్రశ్న కూడా సమాజంలో వుంది. కాని కొన్నిసార్లు ఎంత నిజాయితీగా వ్యాపారం సాగించినా అధికారుల జేబులు నింపకుండా వుండలేని పరిస్ధితులు మన సమాజంలోనే వున్నాయి. అవే అధికారులకు వరంగా మారుతోంది. అలా తెలంగాణలో అవినీతి ఊడల మర్రిలా మారిపోయింది.. మర్రి చెట్టుకున్న ఊడలెన్ని నరికేసినా, మళ్లీ ఊడలు ఎలా పుట్టుకొస్తాయో…అవినీతి అదికారులు కూడా అలాగే పెరిగిపోతున్నారు. ఎంత మందిని పట్టుకున్నా అవినీతి ఒక్క శాతం కూడా తగ్గడంలేదు. ఇది ప్రజల దౌర్భాగ్యం. అలాంటి శాఖలో సివిల్ సప్లయ్ చేరిపోయింది. లంచాలను విపరీతంగా దండుకుంటోంది. ఒకప్పుడు సివిల్ సప్లయ్ శాఖలో పనిచేయాలంటే అధికారులకు నచ్చేదికాదు. పైసా లాభం వుండదని అనుకునే వారు. జీతం తప్ప చాల నీళ్లకు కూడా రూపాయి రాదని దిగులు పడుతుండేవారు. కాని ఇప్పుడు సివిల్ సప్లయ్ శాఖలో చిన్న కొలువు వస్తే చాలు. జీతం ఇవ్వకున్నా పరవాలేదు? అన్నట్లుగా మారిపోయింది. సివిల్ సప్లయ్‌శాఖలో పనిచేసే కింది స్దాయి అధికారి దగ్గర నుంచి పై స్దాయిదాకా పైసలే పైసలు. లంచాలే లంచాలు. అవి వేలల్లో కాదు. లక్షల్లో దండుకుంటున్నారు. అదికారులు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మిల్లులు నడిపే వ్యాపారుల కన్నా, ఆ శాఖలో పనిచేసే అదికారులే ఎక్కువ సంపాదిస్తున్నారని కూడా అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒట్టిపోయిన ఆవులా వుండేది. ఆ శాఖ నిర్వహణే కష్టమనేలా వుండేది. ఇప్పుడు పాడి ఆవులా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత గణనీయంగా సాగు ఉత్పత్తి పెరిగింది. పదేళ్ల కాలంలో దేశానికే అన్నం పెట్టే స్దాయికి తెలంగాణ ఎదిగింది. ఇంకేముంది. అదికారుల చూపంతా సివిల్ సప్లయ్ శాఖపై పడిరది. ఆ శాఖలో అదికారుల కొరత రెవిన్యూ శాఖ అధికారులకు వరంగా మారింది. రెవిన్యూ శాఖ నుంచి పెద్ద సంఖ్యలో అదికారులు సివిల్ సప్లయ్ శాఖకు వలస వెళ్లారు. ఒకప్పుడు రెవిన్యూశాఖలో చన్ని చిన్న సర్టిఫికెట్లకు కూడా లంచం తీసుకునే అలవాటు వుండేది. ఇప్పుడు కళ్ల ముందు వేల కోట్ల రూపాయల వ్యాపారం కనిపిస్తోంది. లక్షల టన్నుల వడ్లు సాగుతౌతున్నాయి. ఒక్క సారి వచ్చే పంట దిగుబడి కోటి అవరై లక్షలుగా నమోదౌతోంది. పెద్దఎత్తున మిల్లుల ఏర్పాటైంది. ప్రభుత్వమే నేరుగా వడ్లు కొనుగోలు చేసి, మిల్లర్లకు అప్పగించడం అనేది అదికారులకు పంట పండిస్తోంది. దాంతో రైతు నుంచి వడ్లు సేకరించే దగ్గర నుంచి అధికారులకు లంచాలు అందుతున్నాయి. మిల్లులనుంచి ఆఖరుకు సివిల్ సప్లయ్ శాఖ గోడౌన్లకు బియ్యం చేర్చడానికికూడా అదికారులు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోంది. తాగాజా ఆఫిషాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన అందకు సాక్ష్యంగా నిలుస్తోంది.. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైస్ మిల్లర్ పిడిఎస్ బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్‌కు చేరవేస్తున్న సందర్భంలో జిల్లాకు చెందిన సివిల్‌సప్లయ్ డిఎం. నర్సింగరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. లారీకి ఇరవై వేల చొప్పును మూడు లారీలకు కలిపి, రూ.75వేలు లంచం తీసుకుంటుంటే ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఇంత వరకు బాగానే వుంది. ఇకపై అధికారులు తమ తీరు మార్చుకుంటారా? అంటే మారరు. అలా మారేదే వుంటే ఇంత మంది అవినీతి అదికారులు పట్టుబడుతున్నా ఎవరూ భయపడడం లేదు? లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. పట్టుబడేవారు పట్టుబడుతూనే వున్నారు. లంచాలు తీసుకునే వారు తీసుకుంటూనే వున్నారు. అదే ఆసిఫాబాద్ జిల్లా మిల్లర్‌కు రేపటి నుంచి అధికారులు సహకరిస్తారా? అనే ప్రశ్నకు ఎవరు సమాదానం చెప్పాలి. తోటి అధికారిని పట్టించినందుకు మిగతా అధికారులు ఎప్పుడూ నిఘా వేసి వుంచుతారు? పైగా వడ్ల కేటాయింపుల్లో ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ఆ మిల్లర్‌కు భవిష్యత్తులో మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు? మిల్లర్లు తెగించకపోతే ఒక సమస్య. తెగిస్తే మరో సమస్యగా మారింది? ఇలాంటి లంచాల వాతావరణంలో ఏ రైస్ మిల్లర్ సంతోషంగా లేడన్నది తేలిపోతోంది. రైస్ మిల్లర్లు ఎలాంటి మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అదికారులు, లంచాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. అంతే కాకుండా మిల్లర్లు కూడా అధికారుల వేధింపులను తట్టుకోలేకపోతున్నారు. దాంతోవాళ్లు కూడా విసిగిపోయి, ఏసిబిని ఆశ్రయించాల్సి వస్తుందంటే పరిస్దితులు ఎంత దుర్భరంగా మారుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. ఇలా మిల్లర్లు అన్ని వైపులా వేదింపులే ఎదుర్కొంటున్నారు. అధికారుల జేబులు నింపుకుంటూ వ్యాపారాలు సాగిస్తున్నారు. సరిగ్గా వడ్లు వచ్చే సమయానికి మిల్లుల మీద దాడులు మొదలు పెడతారు. మిల్లర్లను బెదిరిస్తుంటారు. ఏదో ఒక చిన్న సాకు చూపించి పెద్ద పెద్ద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తుంటారు. దాంతో మిల్లర్లు బతకలేకపోతున్నారు. మిల్లర్లు మొత్తం ప్రభుత్వం నుంచే వడ్లు సేకరిస్తే వారికి పెద్దగా ఒరిగేదేమీ వుండదు. కొంత మంది రైతులు నేరుగా మిల్లర్లకే అమ్ముతుంటారు. అలా కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చి మిల్లర్లు అమ్ముకుంటేనే వారికి లాభాలు వస్తాయి. మొత్తం ప్రభుత్వ వడ్లనే బియ్యంగా మార్చితే మిల్లర్లు పెద్దగా లాభాల పొందే అవకాశం లేదు. ఇదే అధికారులకు వరంగా మారుతోంది. మిల్లర్లను నిండా ముంచేస్తోంది. మిల్లర్లు తమ ఆదాయం కన్నా, ఎక్కవ లంచాలే చెల్లించాల్సిన పరిస్దితులు కూడా ఎదురౌతున్నాయని మిల్లర్లు వాపోతున్నారు. అటు సరిగ్గా వడ్లు కొనుగోలు చేసే సమయంలోనే మిల్లర్లకు ఖర్చు వుంటుంది. ఆ సమయంలో అటు రైతుల కోసం అప్పులు చేసి చెల్లింస్తుంటారు. అటు అప్పులు చేసి మిల్లర్లు వ్యాపారం చేస్తుంటే అధికారులు దోడిపీ మొదలు పెడతారు. దాంతో మిల్లర్లు వ్యాపారం వదుకునేందుకు కూడా కొందరు సిద్దపడుతున్నారు. ఇటీవల ఓ జిల్లాలో అధికారుల వేధింపులకు ఓ మిల్లర్ ఇంట్లో వున్న బంగారం అమ్మి మరీ అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్దితి ఎదురైందని తెలుస్తోంది. లేకుంటే మిల్లు సీజ్‌చేస్తాం? కేసులు నమోదు చేస్తాం? మొత్తం వ్యాపారం మూసేస్తాం? అంటూ బెదిరిస్తారు. లేని కేసులు నమోదు చేస్తారు? వేధిస్తారు. వాటికన్నా బంగారం అమ్ముకొని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్దితులు ఎదరౌతున్నాయని మిల్లర్లు దుఖపడుతున్నారు. మరో జిల్లాలో అసలు లేని లెక్కలు ముందు వేసి లంచాలు అడిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేయని వడ్లను కోట్లలో చూపించి, మిల్లర్‌ను అదికారులు బెదిరిస్తున్నారు. వర్షం పడే సమయానికి, మబ్బులు పడుతున్న సమయం చూసి మిల్లుల తనిఖీలకు అధికారులు వెళ్తున్నారు. వర్షానికి తడవకుండా వున్న వడ్ల వస్తాలపై కప్పిని టార్పాలిన్‌ను తొలగించి వర్షంలోనే లెక్కలు చూస్తామంటారు. దాంతో మిల్లర్లు ఆందోళన వ్వక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఎండిన వడ్లు మళ్లీ తడిస్తే ఎంత కష్టమో, నష్టమో మిల్లర్లకు తెలుసు. వాటిని మళ్లీ ఆరబెట్టినా ఫలితం వుండదు. ఎండ కాసిన రోజు వచ్చి లెక్కలు చూసుకోండి? ఒక్క బస్తా తక్కువున్నా కేసులు నమోదు చేయండి? అని మిల్లర్లు చెబుతున్నా మాకే ఎదురు చెబుతావా?అంటూ కూడా బెదిరిస్తున్నారట. లేకుంటే అడిగినంత ఇవ్వమంటున్నారట? ఇలా వుంది అదికారుల తీరు. అంతే కాదు గంటలో అడిగినంత లంచం సమకూర్చకపోతే కేసులు నమోదు చేస్తామంటున్నారట. అయితే బడా బడా మిల్లర్ల జోలికి సివిల్ సప్లయ్ శాఖ అధికారులు పోరు. ఎందుకంటే వాళ్ల నుంచి ఎప్పటికప్పుడు అందాల్సినంత అందుతూనే వుంటుంది. వందల కోట్లు బకాయిలువున్న మిల్లర్లు ఎన్నితప్పులు చేసినా పట్టించుకోరు. కాని చిన్న చిన్న మిల్లర్లు ఎలాంటి తప్పు చేయకున్నా వేదిస్తుంటారు. ఇలా వేదిస్తున్న అదికారుల లెక్కలన్నీ నేటిధాత్రి చేతిలో వున్నాయి. వారి వివరాలు, వారి బాగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో కథనాలు వస్తాయి!
