ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:-
ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి పై సింగిల్ విండో డైరెక్టర్లు తెలంగాణ సహకార సంఘం చట్టం 1964 లోని నిబంధన 34(A) ప్రకారం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి డిప్యూటీ రిజిస్టర్ అధికారి బి.రాంమోహన్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆళ్ళ సుమన్ రెడ్డి, కట్కూరి కవిత కాంతాల సమ్మిరెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, కోట విజయ,కొట్టే దేవేందర్, తాళ్ల పెళ్లి సదయ్య, చింతం కుమారస్వామి, గుగులోతు పర్ష నాయక్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి లు పాల్గొన్నారు.