
# ప్రకటనలలో నర్సంపేట పేరు ఉండడం పట్ల హర్షం వ్యక్తం..
# నేను చేసిన కృషి ఫలించింది.
# 2024-25 విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం..
# ఎంబిబిఎస్ సీట్ల తగ్గింపుతో పీ.జీ సీట్ల అడ్మిషన్లకు ఇబ్బందులు..
# కళాశాల వసతుల పట్ల బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..
# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రానికి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు.అందులో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రానికి సంబందించిన మెడికల్ కళాశాల నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. నియోజకవర్గంలో ఉన్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో 350 పడకల జిల్లా ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభవానికి సిద్ధంగా ఉన్నది. అలాగే ఎడ్యుకేషన్ హబ్ గా వివిధ ప్రభుత్వ గురుకుల విద్యాలయాలతో పేరు పొందుతున్న నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని తేవడం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన వరంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాగా ఇటీవల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) ప్రకటించిన లిస్టులో నర్సంపేట పేరు పొందుపరిచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నియోజకవర్గం ప్రజలు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు,విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2024-25 ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు.మెడికల్ కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల జాబితాలో వరంగల్ రూరల్ ప్రాంతమైన మన నర్సంపేట ఉండడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. గతంలో ముందస్తు చూపుతో 250 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిదశకు తీసుకురావడం వలనే నేడు నర్సంపేటకు ఎన్ఎంసి గుర్తింపుతో మెడికల్ కాలేజి ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీని మంజూరు చేపించినప్పుడు 100 సీట్లతో అనుమతులను తేవడం జరిగిందని
కానీ నేడు కంగ్రెస్ ప్రభుత్వం 50 సీట్లతో ప్రారంభిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయని తద్వారా భవిష్యత్తులో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్ల అడ్మిషన్లలో వెనుకబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైన దీనిపై ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించిన దాఖలాలు లేవమి ఆరోపించారు.మెడికల్ కాలేజి వసతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఉపూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పుతూ గతంలో 100 సీట్లు ఉన్నట్టే ఇప్పుడు కూడా 100 సీట్లతోనే తరగతులు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.కాలేజి ఏర్పాటుకు తగు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, స్థానిక కలెక్టర్, రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమవతున్న శుభవేళ, నర్సంపేటలో అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని కోరుతున్నట్లు బిఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకాంక్షించారు.