చాలా అద్భుతంగా అనిపించింది నిత్యా మీనన్
నిత్యామీనన్ (Nithya Menon) వరుస సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘తలైవాన్, తలైవి (Thalaivan Thalaivii) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి సరసన రొమాన్స్ చేయనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమాతో పాటు నిత్యామీనన్, ధనుష్ (Dhanush )సరసన ‘ఇడ్లీ కడై’ (Idli Kadai)లోనూ నటిస్తోంది. ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఇడ్లీ కడాయి సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను.
పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని షూటింగ్ సెట్లో అడగ్గానే ఎందుకు చేయను అని రంగంలోకి దిగా. నా జీవితంలో ఫస్ట్ టైమ్ పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు తయారుచేసు. ఆ మరునాడే నేను జాతీయ అవార్డును తీసుకోవడానికి వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అది చాలా అందంగా ఉంది. అప్పుడు నాకు సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నారు. ‘ఇడ్లీ కడై’ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేది కాదు” అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
