
రేగొండ, నేటి ధాత్రి:
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వ్యూహరచన,పార్టీ శ్రేణుల సమాయతయే ప్రధాన ఎజెండాగా భాజపా రెండు రోజుల జాతీయకాన్సిల్ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి.దేశం నలుమూలల నుండి 12,000 మంది ప్రతినిధులు హాజరుకానుండగా ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏడునూతుల నిషీదర్ రెడ్డి శనివారం హాజరయ్యారు.ఈ సమావేశాలను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించగా ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు ప్రసంగం చేయనున్నారు.ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనగా అక్కడే రెండు రోజుల పాటు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు నిషీదర్ రెడ్డి తెలిపారు.