సమర్థతకు మారుపేరు నిర్మలా సీతారామన్‌

తమిళనాడు పుట్టిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మెట్టినిల్లు

2008లో బీజేపీలో చేరిక

అంచెలంచెలుగా కొనసాగిన ప్రగతి ప్రస్థానం

రెండో మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు

పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు

ఈమె రక్షణమంత్రిగా ఉన్నకాలంలోనే బాలాకోట్‌ దాడులు

ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం

ఈమె హయాంలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరణ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నిర్మలా సీతారామన్‌ మనదేశానికి చెందిన ఆర్థికవేత్త, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్‌వ్యవహారాలశాఖ మంత్రిగా 2019నుంచి పనిచేస్తున్నారు. 1959 ఆగస్టు 18న జన్మించిన ఈమె ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలో ముఖ్య నాయకురాలిగా వున్నారు. ఆమె కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు 2016నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014`16 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. 2017`19 మధ్యకాలంలో దేశానికి 28వ రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖను మరియు ఆర్థికశాఖను నిర్వహించిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఈ రెండు మంత్రిత్వశాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన తొలిమహిళ కూడా సీతారామన్‌ కావడం విశేషం. దివంగత మాజీ ప్రధాని మురార్జీదేశాయ్‌ తర్వాత అత్యధికసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈమెదే. మొత్తం ఎనిమిదిసార్లు నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014`17 మధ్యకాలంలో ఆమె మోదీ ప్రభుత్వంలో జూనియర్‌ మంత్రిగా పనిచేశారు. 2014 మే నుంచి నవంబర్‌ మధ్యకాలంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా రెండు బాధ్యతలను నిర్వహించారు. 2014 నవంబర్‌ నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర) 2017 సెప్టెంబర్‌ వరకు పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా ప్రమోట్‌ అయ్యారు.

ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం

ఫోర్బ్స్‌ా2022 ప్రపంచంలో శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ చోటు సంపాదదించుకున్నారు. ఈ జాబితాలో ఆమెది 36వ స్థానం. ఇదే సంస్థ విడుదల 2023లో విడుదల చేసిన జాబితాలో 32వ స్థానం, 2024 ఫోర్బ్స్‌ జాబితాలో 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫార్చూన్‌ సంస్థ భారత్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమెను పే ర్కొంది. 2025లో కేంద్ర బడ్జెట్‌ను 8వ సారి ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

జన్మస్థలం మదురై

సీతారామన్‌ తమిళనాడులోని మదురైలో అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. సావిత్రి, నారాయణన్‌ సీతారామన్‌లు ఈమె తల్లిదండ్రులు. విల్లుపురంలోని సేక్రెడ్‌ హార్ట్‌ కాన్వెంట్‌ ఆంగ్లో`ఇండియన్‌ స్కూల్‌ లో ఆమె తన ప్రాథమిక పాఠశాల విద్యను కొనసాగించారు. అనంతరం చెన్నై లోని విద్యోదయ పాఠశాలలో చదువుకున్నారు. 1980లో ఆమె తిరుచురాపల్లిలోని సీతాలక్ష్మి రామేశ్వరి కళాశాలలో ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, ఢల్లీిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఇదే విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఎం.ఫిల్‌ పూర్తిచేశారు. ఇండో`యూరో పియన్‌ ట్రేడ్‌పై రీసెర్చ్‌ చేసేందుకు ఇదే విద్యాసంస్థలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికీ, ఈ ప్రోగ్రామ్‌ను మధ్యలో ఆపేసి తన భర్తకు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో స్కాలర్‌షిప్‌ రావడంతో లండన్‌ వెళ్లిపోయారు. 

రాజకీయ జీవితం

2003-05 మధ్యకాలంలో నిర్మలా సీతారామన్‌ జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా పనిచేశారు. తర్వాత 2008లో భారతీయ జనతాపార్టీలో చేరారు. అప్పటినుంచి 2014 వరకు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో ఆమెను మోదీ ప్రభుత్వంలో జూనియర్‌ మం త్రిగా తీసుకున్నారు. ఇందుకోసం ఆమెకు ఆంధ్రప్రదేశ్‌నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇప్పించారు. 2016లో రాజ్యసభకు పోటీచేయడానికి పార్టీ నామినేట్‌ చేసిన 12మంది సభ్యుల్లో నిర్మలా సీతారామన్‌ కూడా ఒకరు. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఆమె విజయం సాధించారు. 2019లో బాలాకోట్‌ దాడులు జరిగినప్పుడు ఆమె రక్షణశాఖ మంత్రిగా వ్యవహరించారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ దాడి జరిపింది. ఈ దాడిలో 170మంది జైషే మహమ్మ ద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులను చంపేసినట్టు సైన్యం ప్రకటించింది.

2019 మే 19న నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పదవీ బా ధ్యతలు స్వీకరించారు. దేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్రసృష్టించారు. ఆమె మధ్యంతర బడ్జెట్‌ను 2019 జులై నెలలో ప్రవేశపెట్టారు. 2020`21కి సం బంధించిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభ ముందుంచారు. కోవిడ్‌`19 మ హమ్మారి కాలంలో ‘కోవిడ్‌`19 ఎకనామిక్‌ రీసెర్చ్‌ టాస్క్‌ ఫోర్స్‌’ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆమె ఆర్థికశాఖ మంత్రిగా వున్న 2022లో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాదు దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) చాలా వేగంగా పెరిగింది. పార్లమెంట్‌ నూతన భవనంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతా రామనే!

లండన్‌లో ఉద్యోగాలు

తాను లండన్‌లో వున్నకాలంలో రీజెంట్‌ స్ట్రీట్‌లోని ఒక హోమ్‌ డెకార్‌ స్టోర్‌లో సేల్స్‌పర్సన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. యు.కె. అగ్రికల్చర్‌ ఇంజీనీర్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఒక ఆర్థికవేత్తకు అసిస్టెంట్‌గా వున్నారు. అక్కడే పి.డబ్ల్యు.సి.కి సీనియర్‌ మేనేజర్‌ (ఆర్‌Êడి)గా, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లో కొద్దికాలం పనిచేశారు. 

2017లో మనదేశ జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా వుండటమే కాదు హైదరాబాద్‌లోని ‘ప్రణవ’కు వ్యవస్థాపక డైరెక్టర్లలో ఆమె కూడా ఒకరు. 2019లో జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్సిటీ ఆమెకు డిస్టింగ్విష్‌డ్‌ అలుమిని అవార్డును ప్రదానం చేసింది. 2019లో ఫోర్బ్స్‌ మ్యాగజై న్‌ ప్రకటించిన ప్రపంచంలో వందమంది శక్తివంతమైన మహిళల జాబితాలో ఈమెకు 34వ స్థానం దక్కింది. ఎకనామిక్‌ టైమ్స్‌ ఇచ్చే కార్పొరేట్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌కు ఆమె 2024లో ఎంపికయ్యారు. ఆర్థిక మంత్రిగా ఆమె వాణిజ్య సంస్కరణ వేత్తగా ఈ అవార్డు ద్వారా గుర్తింపు లభించింది. 

నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ కూడా మంచి ఆర్థికవేత్త మాత్రమే కాదు గొప్ప రాజకీయ వ్యాఖ్యాత కూడా. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఇద్దరు ఒకరికొకరు పరిచయమై చివరకు వివాహానికి దారితీసింది. నిర్మలా సీతారామన్‌ బీజేపీలో చేరగా పరకాల ప్రభాకర్‌ కుటుంబం కాంగ్రెస్‌ అనుయాయులు. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. వీరిద్దరూ 1986లో వివాహం చేసుకోగా, ఈ దంపతులకు ఒక కుమార్తె. ఆమె కొంతకాలం హిందూలో తర్వాత మింట్‌లో పనిచేశా రు. 2014`18 వరకు పరకాల ప్రభాకర్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సమాచార సలహాదారుగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!