మలహార్ రావు, నేటిధాత్రి :
మండలంలోని నాచారం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో శుక్రవారం రోజున క్లస్టర్ ఫెసిలెటేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు పూడికతీత పనులను ఎన్.ఐ.ఆర్.డి ప్రొఫెసర్ డాక్టర్ ముత్యాల్లు, తమ సిబ్బందితో సందర్శించి కూలీలతో మాట్లాదరు. గ్రామంలో జరుగుతున్న ఎన్.ఆర్.ఎం వర్క్స్, వాటర్ హారవిస్టింగ్, ఫారం ఫౌండ్స్, SC, ST జాబ్ కార్డ్స్ కూలీల కు ఎక్కువ పని దినాలు కలిపించాలి అన్ని పేమెంట్స్ ఇన్ టైం లో పూర్తి చేయాలిని క్లస్టర్ ఫెసిలెటేషన్ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను కూలీలకు వివరించడము జరిగింది. ఈ కార్యక్రమం లో సీ.ఆర్.డి కో- ఆర్డినేటర్ రఘు, జిల్లా కో- ఆర్డినేటర్ నితిన్, నాగేంద్ర, ఏపిఓ హరీష్, టెక్నికల్ అసిస్టెంట్స్ రమేష్, శేఖర్, సి.సి వెంకట్, కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, మేట్స్, కూలీల్లు తదితరులు పాల్గొన్నారు.