కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదో వర్ధంతి

Comrade Rayala Subhash Chandra Bose

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదో వర్ధంతి సభను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపందా సిద్ధాంతకర్త కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి బహిరంగ సభ పోస్టర్లను గుండాల సెంటర్ లో శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, నాయిని రాజు , పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ లు మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)కు ఉందన్నారు. గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులు గిరిజనేతర పేద ప్రజలకు సాధించడంలో రవన్న పాత్ర క్రియాశీలకమైందని వారన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కరెంటు, రహదారి , విద్య, వైద్యం అభివృద్ధి చెందాలని అనేక ప్రజా పోరాటాలు నిర్వహించడంలో కామ్రేడ్ రవన్న చూపిన మార్గదర్శకం పార్టీకి అమోఘంగా ఉందని వారన్నారు. కామ్రేడ్ రవన్న భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే రష్యా తరహా పెట్టుబడిదారీ దేశంగా ఇండియా ఉందని ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పార్టీ కార్యక్రమం, పందా, నిబంధవాలిని మార్చుకోవాలని సిద్ధాంతికరించిన గొప్ప నాయకుడని వారు కొని యాడారు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను చేయాలని వారు ఆశించారని, దాని ద్వారానే విప్లవం విజయవంతం అవుతుందని నమ్మిన సిద్ధాంతకర్త అని అన్నారు. కామ్రేడ్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను ఖమ్మం పట్టణంలో మార్చి తొమ్మిదో తారీఖున నిర్వహిస్తున్నామని ఈ వర్ధంతి సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాచర్ల సత్యం, కొమరం శాంతయ్య, వాంకుడోత్ అజయ్,బోర్ర ఎంకన్న,గోగ్గిల వెంకటేశ్వర్లు,తెల్లేం రాజు,ఈసం చంద్రన్న, పూనెం మంగయ్య,సనప కుమార్,దుగ్గి రాంబాబు,మోకాళ్ళ అజాద్,ఈసం సమ్మన్న,పూసం రాంబాబు, కోడూరి జగన్, ఎట్టి రాంబాబు,యనగంటి గణేష్,కల్తి పాపన్న, కల్తి రామన్న,ధనుసరి సమ్మయ్య,ఏడూర్ల రామనాథం తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!