నిమ్స్ పనులను వేగవంతం చేయాలి అసెంబ్లీ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో గతం లో ఏర్పడి నిమ్స్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని నేడు అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు ….
గతం లో (2011 వ సంవత్సరం లో ) ఏర్పాటైన నిమ్స్ ప్రాజెక్ట్ లోని కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభించిన ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదు అని *కావున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి , పనులను త్వరగా పూర్తి చేయాలని దీని ద్వారా జహీరాబాద్ నియోజవర్గ ప్రజలకు ఉపాధి కలుగుతుంది అని కోరారు..
అలాగే జహీరాబాద్ నియోజవర్గం లోని బాలికల ఉర్దూ మీడియం కళాశాలలో లెక్చరర్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు అని వెంటనే ప్రభుత్వ లెక్చరర్లు ను నియమించాలని నియోజకవర్గ విద్యార్థినిల భవిషత్తును కాపాడాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు..