
ఎన్నికకు సహకరించినవారికీ కృతజ్ఞతలు.
నీల్య నాయక్
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ గా జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండల యన్మన్ గండ్ల పరిధిలోని తూక్య తాండ కు చెందిన వడిత్యావత్ నీల్యనాయక్ నియమితులయ్యారు. ఆయనకు శుక్రవారం గాంధీ భవన్ లో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ నియామక పత్రాన్ని నీల్యా నాయక్ కు అందజేశారు. ఈ సందర్భంగా నీల్య నాయక్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మంకంతో జిల్లా వైస్ చైర్మన్ బాధ్యతను పార్టీ నాయకత్వం అప్పగించిందని ఆ బాధ్యతను అంతఃకరణ శుదితో నిర్వర్తిస్తానని అన్నారు. తనను ఈ ఎన్నికకు సహకరించిన తేజావత్ బెల్లయ్య నాయక్, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి,టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ లింగం నాయక్ లకు నీల్య నాయక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.