
ఆ స్టార్ హీరోపై నిధి అగర్వాల్ పొగడ్తల వర్షం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో.. బాబి డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుండగా.. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాసుంది. ఈ సందర్భంగా గురువారం నిధి అగర్వాల్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ వంటి తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోతో కలిసిన నటించడం గొప్ప అదృష్టం. ఆయనతో ఒక్క సినిమా చేసినా అది వంద సినిమాలతో సమానం. ఈ సినిమాలో నా పాత్ర పేరు పంచమి. తను చాలా శక్తివంతురాలు. ఎలాంటి సవాలునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే ధైర్యశాలి. నా పాత్ర భిన్న కోణాలతో ఆసక్తికరంగా సాగుతుంది. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథను రాశారు. ఇందులో పవన్‌కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ సన్నివేశం ఉంటుంది. అందులో అభినయించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.