కరకగూడెం ఎస్సై రాజేందర్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
మండల ప్రజలకు ముందస్తు నూతన సం వత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి అని కరకగూడెం ఎస్సై రాజేందర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, 31 రాత్రి గుంపులు గుంపులుగా తిరగరాదని అన్నారు. ఎటువంటి ఎంట ర్టెన్మెంట్ కార్యక్రమాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కేక్ కట్ చేయాలి అనుకునే వారు తమ తమ ఇళ్ళలోనే చేసు కోవాలని సూచించారు. నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలను తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వ హించుకోవాలని ఎస్సై రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతంకల్పించకుండా నూతన సంవత్సరానికి స్వాగత వేడుకలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని హితవు పలికారు. సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శుతి మించకుండా పోలీసుల సూచనలు తప్పకుండా పాటించ వలసింది గా సూచించారు. టపాసులు పేలుస్తూ
ఇతరులకు అసౌకర్యం ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. ఎవరైనా శృతిమించి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే, వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్లు మోటార్ సైకిల్ (ద్విచక్ర వాహనాలు) నడుపుతూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్ యజమానిపై, తల్లిదండ్రులు పై చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.