చిరు వ్యాపారుల సముదాయంలో ఇక కూరగాయలు, పండ్లు, పూలు
ప్రజల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ ప్రారంభం..
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ వీధి వ్యాపారస్తుల సౌకర్యార్ధం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో కూరగాయల మార్కెట్ ప్రాంగణమును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంబించారు 15వ ఆర్థిక సంఘం, నగరాభివృద్ధి నిధులనుంచి 15 లక్షల నిధులను వెచ్చించి వీది వ్యాపారస్తులు కూరగాయలు, పూలు,పండ్లు అమ్మకాలు జరుపుకునేందుకు వీలుగా కూరగాయల మార్కెట్ ప్రాంగణం నిర్మాణం చేపట్టి త్వరితగతిన పనులను పూర్తి చేయించారు.

రాత్రి పూట వెలుగు కోసం లక్ష రూపాయల తో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేశామని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి గత రెండు సంవత్సరాలలో 120 కోట్ల అభివృద్ధి నిధులను వెచ్చించామని, అభివృద్ధి కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మారుతీ ప్రసాద్, అధికారులు, డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్, మాజీ చైర్పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, 17వ వార్డు నాయకులు రామకృష్ణ, రవీందర్,గోపతి రాజయ్య, 22 వార్డుల ఇంచార్జిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
