జైపూర్, నేటి ధాత్రి:
తేదీ 16.9.2024 సోమవారం రోజున ఎస్టిపిపి లోని సేవా భవన్ లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్టిపిపి హెడ్ అఫ్ ది ప్లాంట్ ఎన్.వి.రాజశేఖర్ రావు పాల్గొని నూతన టైలరింగ్ బ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈడి ఎన్.వి.రాజశేఖర్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మహిళా సాధికారతకు ఏంతో ప్రాముఖ్యతనిస్తుందని స్త్రీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాదని, అందులో భాగంగానే సేవా సమితి ద్వారా ప్రభావిత గ్రామాల లోని మహిళలకు వివిధ రకాలైన స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నదని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ రోజున నూతన టైలరింగ్ బ్యాచ్ ను 25 మంది మహిళలతో ప్రారంభించుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సదావకాశాన్ని మహిళలు అధిక సంఖ్యలో వినియోగించుకోవాలని, తద్వారా వారు స్వయం సమృద్ధి సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సేవా సమితి కో ఆర్డినేటర్ చిలుక అరుణ, టైలరింగ్ శిక్షకురాలు రఫియ,సింగరేణి సేవా సమితి ఇంచార్జి ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్,మరియు మహిళలు పాల్గొన్నారు.