గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని నూతన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన మాటను ఓ గ్రామ నూతన సర్పంచ్ నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారా చేసిన తరువాత ఒక్కొక్కటిగా గ్రామంలోని పనులు తాగునీటి సమస్యను తీర్చారు.ఝరాసంగం మండలంలోని తుమ్మనపల్లి గ్రామానికి చెందిన నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం
పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా చేయించారు.
గతంలో కూడా గ్రామస్తులు అవసరాల కోసం అప్పుడు కూడా సొంత ఖర్చులతో పైపులైన్ వేయించారు. కొంతకాలం తాగునీటి సరఫరా జరిగింది. పైపులైన్ దెబ్బతిని తాగునీటి సమస్య ఏర్పడింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఒకటి ఒకటి పనులు పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
