BC JAC Felicitates Newly Elected Sarpanch in Zaheerabad
బీసీ జేఏసి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కు సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ తాలూకా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొగుడంపల్లి మండల, పర్వతపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన నాయకుని బసంతి ని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అందరూ సోదరుడు గా ఉండాలని, గ్రామాభివృద్ధి కి కృషి చెయ్యాలని కొనియాడారు. జహీరాబాద్ తాలూకా లో అందరూ బీసీ సోదరులు ఐక్యంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తాలూకా బీసీ జెఏసి గౌరవ అధ్యక్షుడు కొండపురం నర్సిములు,జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ,జహీరాబాద్ తాలూకా బుడగ జంగల యువ నాయకులు పార్ల నగేష్,మాదినం శివ ప్రసాద్,జహీరాబాద్ నాయి బ్రాహ్మణ కోశాధికారి దత్తాత్రి, దశరత్,మధు సుధాకర్, మాదిగ పవన్ కుమార్, బాలరాజ్,మన్నే అరుణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
