New Sarpanch Celebrates Sankranti with Villagers
సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న నూతన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంక్రాంతి పండుగ సందర్భంగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ మరియు తన మిత్రుడు యువ నాయకుడు దత్తారెడ్డి యువ నాయకుడు శశివర్ధన్ రెడ్డి తన స్వగ్రామమైన తుమ్మనపల్లి లో గాలిపటాలు ఎగురవేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఇంటికి ఆనందం,శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
