
New Ration Cards
కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన హనుమంతరావు పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో రాష్ట్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణి చేసిన సందర్భంగా మాట్లాడారు.
గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాయంలో కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి రాఘవేంద్ర కృష్ణ ప్రకాష్ రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,